Hanuman-OTT: ఓటీటీ కన్నా ముందే.. టీవీలో!

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:33 PM

సంక్రాంతి బరి సూపర్‌హిట్‌గా నిలిచి దాదాపు రూ.330 కోట్ల వసూళ్లు రాబట్టిన 'హనుమాన్' (Hanuman) చిత్రం ఓటీటీ (ott) విడుదల కోసం ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Hanuman-OTT:  ఓటీటీ కన్నా ముందే.. టీవీలో!


సంక్రాంతి బరి సూపర్‌హిట్‌గా నిలిచి దాదాపు రూ.330 కోట్ల వసూళ్లు రాబట్టిన 'హనుమాన్' (Hanuman) చిత్రం ఓటీటీ (ott) విడుదల కోసం ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా విడుదలై వారాలు దాటుతున్నా థియేటర్స్‌లో ఆదరణ బావుండటం వల్ల ఓటీటీ విడుదలను వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఓటీటీ కన్నా ముందు టీవీలో ప్రసారం కానుందీ సినిమా. మార్చి 16న రాత్రి 8 గంటలకు కలర్స్‌ సినీప్లెక్స్‌ ఛానెల్‌, జియో సినిమాలో కేవలం హిందీలో టెలికాస్ట్‌ అవుతుంది. ఈ వివరాలను కలర్స్‌ సినీప్లెక్స్‌ సోషల్‌ మీడియా ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ పెట్టింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దాన్ని రీట్వీట్‌ చేయడంతో అధికారికంగా ప్రకటించినట్లైంది.

అయితే మార్చి 2 నుంచి ‘జీ 5’లో ‘హనుమాన్‌’ స్ట్రీమింగ్  ఆవుతుందంటూ కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత, మార్చి 8న అని టాక్‌ వినిపించింది. దీంతో, కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో ‘జీ5’ సంస్థ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఈ సినిమా ఎప్పుడొస్తుందని ప్రశ్నించారు.. దీనిపై స్పందించిన సదరు సంస్థ విడుదల తేదీపై నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. 

Updated Date - Mar 09 , 2024 | 12:35 PM