Nithya Menen: నిత్యామీనన్ కొత్త సినిమా అప్‌డేట్‌!

ABN , Publish Date - Apr 09 , 2024 | 11:25 AM

కథానాయిక ప్రాధాన్యం, నటనకు ఆస్కారమున్న పాత్రలకు కేరాఫ్‌ నిత్యామీనన్ (Nithya Menen) . ఆమె ఓ కథ అంగీకరించిందీ అంటే ఆ కథలో ఏదో విషయం ఉందని భావిస్తారు.

Nithya Menen: నిత్యామీనన్ కొత్త సినిమా అప్‌డేట్‌!
Nithyamenen

కథానాయిక ప్రాధాన్యం, నటనకు ఆస్కారమున్న పాత్రలకు కేరాఫ్‌ నిత్యామీనన్ (Nithya Menen) . ఆమె ఓ కథ అంగీకరించిందీ అంటే ఆ కథలో ఏదో విషయం ఉందని భావిస్తారు. ఈ మధ్యన కాస్త జోరు తగ్గించింది నిత్యా. కానీ ఆడపాదడపా వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా రాబోయే సినిమాకు ‘డియర్‌ ఎక్స్‌సెస్‌’ (Dear exes) అనే పేరును ఖరారు చేసినట్లు తెలిపింది. తమిళ దర్శకురాలు కామిని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిత్రం బృందం తెలిపింది.

Nithya.jpeg

‘మ్యాజిక్‌ మొదలుకానుంది’ అనే వ్యాఖ్యతో విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇందులో చీరకట్టులో అందంగా ముస్తాబైౖ ఒక చేతిలో డ్రింక్‌ మరోవైపు ఫోన్‌ పట్టుకుని సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది నిత్య. ప్రేమలో ఓడిపోయిన ఓ అమ్మాయి జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అన్న ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. బాస్క్‌ టైమ్‌ థియేటర్‌, పోప్టర్‌ మీడియా నెట్‌వర్క్‌ బ్యానర్‌లపై ఆదిత్య అజయ్‌ సింగ్‌, రామ్కి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవదీప్‌, వినయ్‌రాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Updated Date - Apr 09 , 2024 | 11:25 AM