Kaliyugam Pattanamlo: ‘నీ వలనే’ పాటొచ్చింది.. త్వరలోనే ట్రైలర్

ABN , Publish Date - Mar 09 , 2024 | 09:13 PM

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రానికి కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ సినిమా నుండి ‘నీ వలనే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.

Kaliyugam Pattanamlo: ‘నీ వలనే’ పాటొచ్చింది.. త్వరలోనే ట్రైలర్
Kaliyugam Pattanamlo Movie Still

నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయుషి పటేల్ (Aayushi Patel) హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రానికి కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి (Ramakanth Reddy) చూసుకుంటున్నారు. రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ సినిమా నుండి ఓ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.


Kaliyugam.jpg

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్‌ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టారు. ఈక్రమంలోనే విడుదలైన ‘నీ వలనే’ (Neevalane Lyrical Video) అంటూ సాగే ఈ మెలోడి పాటను ఎం.ఎం.మానసీ ఆలపించారు. భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. అజయ్ అరసాద అందించిన చక్కటి బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. మార్చి 22న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమా.. ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని తెలిపారు. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తామని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Shambho Mahadeva: మణిశర్మ మెప్పు పొందిన వర్ధమాన గాయని.. ఎవరంటే?

************************

*Keerthi: మహిళలపై అరాచకాలు జరుగుతుంటే దేవుడెక్కడ? అంటూ నటి సంచలన వ్యాఖ్యలు

*******************************

*Odela 2: శివశక్తిగా తమన్నా భాటియా.. ఫస్ట్ లుక్ ఇదే..

****************************

Updated Date - Mar 09 , 2024 | 09:13 PM