Love Mocktail 2: తెలుగులో.. కన్నడ బ్లాక్ బస్టర్ ల‌వ్ మాక్‌టైల్! 'నీదేలే నీదేలే జన్మ' పాట విడుద‌ల‌

ABN , Publish Date - Apr 08 , 2024 | 03:59 PM

కన్నడ బ్లాక్ బస్టర్ గా నిలిచిన‌ ల‌వ్ మాక్‌టైల్ సినిమాను తెలుగులోకి అనువాదం చేసిన తీసుకువ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో చిత్రం నుంచి 'నీదేలే నీదేలే జన్మ' పాట విడుద‌ల చేశారు

Love Mocktail 2: తెలుగులో.. కన్నడ బ్లాక్ బస్టర్ ల‌వ్ మాక్‌టైల్! 'నీదేలే నీదేలే జన్మ' పాట విడుద‌ల‌
#LoveMoctail2

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నటించిన లవ్ మోక్టైల్ 2 (Love Moctail2) మూవీ నుంచి నీదేలే నీదేలే జన్మ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. నీదేలే నీదేలే జన్మ (Nidele Nidele Janma ) అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా సురేంద్రనాథ్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ (Darling Krishna) గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.

90886b2e-172e-40b8-9746-ea3aef40a29a.jpeg

ఈ సినిమాలో మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. డార్లింగ్ కృష్ణ (Darling Krishna) నిర్మాతగా, దర్శకుడిగా వ్యవహరించ‌డ‌మే కాక త‌నే హీరోగా నటించి మెప్పించాడు. కన్నడలో ఈ లవ్ మోక్టైల్, లవ్ మోక్టైల్ 2 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలవ‌గా.. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకంపై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.


ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామ‌న్నారు. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడని.. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమాకి సంబంధించిన రెండవ పాటను నేడు విడుదల చేశామ‌న్నారు.

Updated Date - Apr 08 , 2024 | 03:59 PM