Nee Dhaarey Nee Katha: కొత్తవారిది ఏ దారి!
ABN , Publish Date - Mar 21 , 2024 | 04:53 PM
ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా 'నీ దారే నీ కథ’. జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. తేజేష్ వీర, శైలజ సహ నిర్మాతలు.

ప్రియతమ్, అంజన, విజయ్, అనంత్, వేద్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న సినిమా 'నీ దారే నీ కథ’. జె.వి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీ జొన్నలగడ్డ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. తేజేష్ వీర, శైలజ సహ నిర్మాతలు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కవిరాయని, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు చేతుల మీదుగా విడుదల చేశారు.
నిర్మాత మాట్లాడుతూ "సినీ నేపథ్యం లేకుండా ముగ్గురు కొత్త వాళ్ళం కొత్త టీమ్‌తో చేసిన చిత్రమిది. మ్యూజిక్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ చిత్రం యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది’’ అని అన్నారు.
మరో నిర్మాత శైలజా జొన్నలగడ్డ మాట్లాడుతూ "టెక్నికల్ వాల్యూస్‌తో మ్యూజిక్ బ్యాక్ డ్రాప్‌తో ఈ చిత్రాన్ని తీశాం. బుడాపెస్ట్‌లో చేసిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా థీమ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ హాలీవుడ్ నుంచి అలెగ్జాండర్, మ్యూజిక్ ఆర్కెస్ట్రా, బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా గతంలో మిషన్ ఇంపాజిబుల్, పారాసైట్, స్క్విడ్ గేమ్ వంటి చిత్రాలకు ఆర్కెస్ట్రా అందించిన టీం ఈ చిత్రానికి పని చేశారు" అని అన్నారు.
దర్శకనిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ "న్యూయార్క్‌లో డైరెక్షన్ కోర్స్ చేసి వచ్చాను. యూఎస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మన నేటివిటీకి తగినట్టుగా, తెలుగువారికి నచ్చే రీతిలో మార్పులు చేసి చిత్రీకరణ చేశాం. సింక్ సౌండ్‌లో ఈ సినిమాను తీశాం. ఈ సినిమా మ్యూజిక్ ఒక మంచి ఫీల్ అందిస్తుంది’’ అన్నారు.