NBK 109: సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌!

ABN , Publish Date - Mar 08 , 2024 | 06:09 PM

నందమూరి కథానాయకుడిగా కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో NBK109’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది.

NBK 109: సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌!

నందమూరి కథానాయకుడిగా కె.ఎస్‌.రవీంద్ర దర్శకత్వంలో NBK109’ వర్కింగ్‌ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే! శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేసింది. బాలకృష్ణ-బాబీ కాంబినేషన్‌ కారణంగా ఇప్పటికే ఏర్పడిన అంచనాలను ఈ గ్లింప్స్‌ మరో స్థాయికి తీసుకెళ్లేలా ఉంది. యాక్షన్‌ సీక్వెన్స్‌తో రూపొందించిన గ్లింప్స్‌లో బాలకృష్ణను దర్శకుడు బాబీ ‘నేచురల్‌ బోర్న్‌ కింగ్‌’’గా చూపించారు. కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తూనే తనదైన శైలిలో పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ తో అదరగొట్టారు బాలయ్య.

NBK109-PlainStill-2.jpg

బాలకృష్ణ తన టూల్‌ బాక్స్‌లో ఆయుధాలతోపాటు మాన్షన్‌ హౌస్‌ ఆల్కహాల్‌ బాటిల్‌ని తీసుకెళ్లడం మనం చూడవచ్చు. గూండాలు తన వైపు పరుగెత్తుకుంటూ వస్తుంటే, బాలయ్య కూల్‌గా ఆల్కహాల్‌ తాగడం ఆకట్టుకుంది. ‘‘ఏంట్రా వార్‌ డిక్లేర్‌ చేస్తున్నావా?’’ అని ప్రత్యర్థి గ్యాంగ్‌లోని వ్యక్తి అడగగా.. ‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్‌ అవ్వదురా లఫూట్‌.. ఇట్స్‌ కాల్డ్‌ హంటింగ్‌’’ అంటూ పవర్‌ ఫుల్‌ డైలాగ్‌తో బాలకృష్ణ వేట మొదలుపెట్టడం గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉంది. గ్లింప్స్‌ను ‘కల్ట్‌ సరుకు’ అని పిలవడం మునుపెన్నడూ లేని విధంగా భారీ కిక్‌ ఇస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూచి?యోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

NBK109-PlainStill-1.jpg

Updated Date - Mar 08 , 2024 | 06:10 PM