scorecardresearch

Naveen polishetty: 'లైఫ్‌ ఒక జిందగి అయిపోయింది’ నవీన్  పోలిశెట్టి వీడియో వైరల్‌

ABN , Publish Date - Aug 03 , 2024 | 05:01 PM

నవీన్  పోలిశెట్టి (Naveen Polishtty) సోషల్‌ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఫ్‌ స్క్రీన్లోనూ  ఆయన నవ్వులు పూయిస్తుంటారు. ఇటీవల ఆయనకు జరిగిన ప్రమాదం వల్ల కుడి చేతికి గాయమైంది.  

Naveen polishetty: 'లైఫ్‌ ఒక జిందగి అయిపోయింది’ నవీన్  పోలిశెట్టి వీడియో వైరల్‌

నవీన్  పోలిశెట్టి (Naveen Polishtty) సోషల్‌ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఫ్‌ స్క్రీన్లోనూ  ఆయన నవ్వులు పూయిస్తుంటారు. ఇటీవల ఆయనకు జరిగిన ప్రమాదం వల్ల కుడి చేతికి గాయమైంది.  తాజాగా దీనిపై ఫన్నీగా హెల్త్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. చేతికి కట్టుతో ఓ వీడియో షేర్‌ చేశారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే తెరపై కనిపిస్తానని అప్‌డేట్‌ ఇచ్చారు. ‘సింగిల్‌ హ్యాండ్‌ గణేశ్‌’ అంటూ వెంకటేశ్‌ చెప్పిన డైలాగు.. ‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో’ అని చిరంజీవి చెప్పిన డైలాగులను టీవీలో పెట్టుకొని తనను తానే ట్రోల్‌ చేసుకుంటూ నవ్వులు పుట్టించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా (Viral video) మారింది. 

‘జీవితంలో వచ్చిన కష్టాలను నవ్వుతూ ఎదుర్కోవాలి. హాస్యమే మనకు ధైర్యాన్నిస్తుంది. మీ అందరినీ నవ్వించడం నాకెంతో ఇష్టం. పూర్తిగా కోలుకున్న తర్వాత బిగ్‌  స్క్రీన్ పై  మీ అందరినీ కలుస్తాను’’ అని వీడియో ద్వారా తెలిపారు. ఆ వీడియోకు ‘లైఫ్‌ ఒక జిందగి అయిపోయింది’ అనే ఫన్నీ క్యాప్షన్‌ పెట్టారు. ఆయన మాట్లాడుతూ ‘ఇది నాకు క్లిష్ట సమయం. గాయాల కారణంగా త్వరితగతిన నా సినిమాలను మీ ముందుకు తీసుకురాలేకపోతున్నా. అందుకు క్షమించండి. స్ట్రాంగ్  కమ్‌బ్యాక్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. నా తదుపరి చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్  అద్భుతంగా సిద్థమైంది. అది మీకు బాగా నచ్చుతుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత షూట్‌లోకి అడుగుపెడతా. మీ ప్రేమాభిమానాలు నాలో స్ఫూర్తి నింపాయి’’ అన్నారు.

Updated Date - Aug 03 , 2024 | 05:06 PM