Matka: సాహుగా నవీన్‌ చంద్ర.. ఎలా ఉండబోతోందంటే..

ABN, Publish Date - Oct 19 , 2024 | 09:32 PM

వరుణ్‌ తేజ్‌ (varun Tej)హీరోగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’ (Matka).  వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌,  ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్‌ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నారు.

Matka: సాహుగా నవీన్‌ చంద్ర.. ఎలా ఉండబోతోందంటే..

వరుణ్‌ తేజ్‌ (varun Tej)హీరోగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’ (Matka).  వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌,  ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్‌ (Karuna Kumar) దర్శకత్వం వహిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రంలోన నవీన్‌ చంద్ర (Naveen Chandra) క్యారెక్టర్‌ను రివీల్‌ చేశారు. ఇందులో నవీన్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఈ చిత్రంలో సాహుగా కనిపించనున్నారు.

Matka-character_WWS.jpg

దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల చేశారు. వింటేజ్‌ లుక్‌లో స్కూటర్‌ పై కూర్చుని ఇంటెన్స్‌గా చూస్తున్న పోస్టర్‌ క్యురియాసిటీని క్రియేట్‌ చేసింది. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ భారీ బడ్జెట్‌ చిత్రమిది. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ఎ కిషోర్‌ కుమార్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  నవంబర్‌ 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌, పాటలకు చక్కని స్పందన వస్తున్న సంగతి తెలిసిందే\

ఇది కూడా చదవండి..

Renu Desai: రేణు దేశాయి.. ప్రత్యేక పూజలు.. ఎందుకంటే..


Updated Date - Oct 20 , 2024 | 03:20 PM