Natti kumar Fire: సంక్రాంతి సినిమాలు.. ఛాంబర్‌పై నట్టికుమార్‌ ఫైర్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 05:38 PM

ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ల పాలన రావాల్సిందే అని సినీ నిర్మాత నట్టికుమార్‌ అన్నారు. షర్మీల ఎఫెక్ట్‌ వైసీపీకి బలంగా తగులుతుందని అయన హెచ్చరించారు.

Natti kumar Fire: సంక్రాంతి సినిమాలు.. ఛాంబర్‌పై నట్టికుమార్‌ ఫైర్‌


ఆంధ్ర రాష్ట్రం (AP state) అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ల పాలన రావాల్సిందే అని సినీ నిర్మాత నట్టికుమార్‌ అన్నారు. షర్మీల ఎఫెక్ట్‌ వైసీపీకి బలంగా తగులుతుందని అయన హెచ్చరించారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల విషయంలో జరుగుతున్న గందరగోళంపై నట్టి కుమార్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో  తాజా చిత్రాలు, రెండు రాష్ట్రాల్లోని  పాలన, టికెట్‌ రేట్లు ఇలా ప్రతి విషయంపై ఆయన స్పందించారు. సంక్రాంతి బరిలో నిలిచిన అన్ని చిత్రాలకు థియేటర్లు సర్దుబాటు చేయాల్సిన బాధ్యత ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడికి ఉందని నట్టి కుమార్‌ అన్నారు. థియేటర్స్‌ అన్నీ తెలంగాణా ఫిలిం ఛాంబర్‌, తెలుగు ఫిలిం చాంబర్‌  అధ్యక్షుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. సంక్రాంతికి రిలీజ్‌ అయ్యే 'హనుమాన్‌’ మినహా అన్నీ సినిమాలను వారే పంపిణీ చేస్తున్నారని చెప్పారు. 

"పండుగకు విడుదలయ్యే అన్ని చిత్రాలకు థియేటర్స్‌ను సర్దాల్సిన బాధ్యత ఛాంబర్‌ అధ్యక్షుడిగా ఉంది. దిల్‌ రాజు, సునీల్‌ నారంగ్‌ అన్ని సినిమాలకు థియేటర్స్‌ ఇవ్వాలి. అది వారి బాధ్యత. రవితేజ హీరోగా నటించిన ఈగల్‌ చిత్రం విడుదలను వెనక్కి తీసుకెళ్లేందుకు నిర్మాతలతో మాట్లాడి కృషి చేశాం అని చెప్పుకున్నారు. అది ఆ చిత్రాలతోనే విడుదల చేయడానికి ముందే ప్లాన్  చేసుకున్న 'హనుమాన్;కు  థియేటర్స్‌ ఇవ్వాలి. థియేటర్స్‌ ఇవ్వడంలో జరిగిన అన్యాయంపై నిర్మాత చెందిన ఆవేదనను చూశాను. డిస్ట్రి బ్యూటర్‌ను బట్టి కాదు. సినిమాల క్రేజ్‌ను బట్టి థియేటర్స్‌ ఇవ్వాలి’’ అని మండిపడ్డారు. 

అలాగే సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీరు విభజించు- పాలించు అన్న తీరులో ఉందని ఎద్దేవ చేశారు. 100కోట్లు బడ్జెట్‌  దాటితే టికెట్‌ రేటు పెంచుతాం అంటారు. గతంలో బ్రో,  భగవంత్‌ కేసరి చిత్రాలకు టికెట్‌ రేట్‌ పెంచలేదు. కానీ ఇప్పుడు ునా సామిరంగ’ సినిమాకు టికెట్‌ రేటు పెంచినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఇష్టమైన సినిమా వారికి టికెట్‌ రేట్లను గైడ్‌లెన్స చూడకుండా పెంచుతుంది. బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ సినిమాలకు ఒకలా, నాగార్జునకు మరో రేటు ఇస్తారు. ఏపీ సీఎం జగనకు, పోసాని కృష్ణమురళీకి  ఇదెక్కడి న్యాయం. జగన్‌ హిట్లర్‌ పాలనతో ప్రజలందరు ఇబ్బందులకు గురవుతున్నారు. వాలంటీర్లు ప్రజల పక్షాన పని చేయాలి. వారికి ప్రజల సొమ్మే జీతాలుగా ఇస్తున్నారు’ ని అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వానికి విన్నతి...

మరోవైపు చిత్రపురి కాలనీ మీద ఎంక్వెరీ జరగాలని నట్టి కుమార్‌  తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. క్యాష్‌ రూపంగా వందలకోట్లు అన్యాక్రాంతం అయిపోయిందని ఆయన  చాలామంది నిర్మాతలకు ఎలాంటి భూములు రాలేదని వాపోయారు. చిన్న చిత్రాలకు ముఖ్యమంత్రి రేవంత రెడ్డి,  సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకరించాలి.  నిజమైన కార్మికులకు చిత్రపురి కాలనీలో ఇళ్లు లభించాలి. తెలంగాణ సీఎంను కలిసి చిత్రపురి అక్రమాలపై నిరూపిస్తాను. ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్‌ రేటు నిర్ణయించాలని కోరుతున్నాను. సినిమాలకు అనవసరంగా బడ్జెట్‌ పెంచి, ఆ భారం మొత్తం సామాన్య ప్రజలపై పడుతుంది. అభిమానులను అడ్డంగా దోచేస్తున్నారు. 30శాతం వేస్టేజ్‌ అవుతుంది. దాసరి తర్వాత సినీ పెద్ద చిరంజీవి రెమ్యూనిరేషన్స్‌ గురించి మాట్లాడాలి. నిర్మాతలు ఆర్టిస్టుల డేట్స్‌ కోసం విపరీతంగా పోటీ పడి కోట్లు కుమ్మరిస్తున్నారు..


Updated Date - Jan 05 , 2024 | 05:42 PM