Sri Sri Sri Rajavaru: ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌కు.. జూ. ఎన్టీఆర్‌ బావమరిది తొలి చిత్రం

ABN , Publish Date - Jun 10 , 2024 | 03:24 PM

జూ. ఎన్టీఆర్‌ బావమరిది నార్నె నితిన్, సంపద హీరో హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలోతెర‌కెక్కుతున్న‌ యాక్షన్ ఎంటర్ టైనర్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రశంసలు అందుకుంది.

Sri Sri Sri Rajavaru: ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌కు.. జూ. ఎన్టీఆర్‌ బావమరిది తొలి చిత్రం
Narne Nithin

శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై jr ntr బావమరిది నార్నె నితిన్ (Narne Nithiin) , సంపద హీరో హీరోయిన్లుగా శ‌త‌మానంభ‌వ‌తి వంటి భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని అందించిన సతీష్ వేగేశ్నదర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు (Rama Rao Chinthapalli) నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు (Sri Sri Sri Rajavaru). అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U A సర్టిఫికెట్ పొందటంతో పాటు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకుంది.

Narne Nithin

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చింతపల్లి రామారావు (Rama Rao Chinthapalli) మాట్లాడుతూ.. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయన్నారు. అలాగే మా దర్శకుడు సతీష్ వేగేశ్న మంచి అభిరుచి ఉన్న డైరెక్ట‌ర్‌గా పేరుందని.. ఆయన ఈ చిత్రాన్ని రూపొందించిన విధానం ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేస్తుందని అన్నారు. అలాగే మా సినిమా ఇటీవలే సెన్సార్ సభ్యుల ప్రశంసలతో U A సర్టిఫికెట్ పొందడం సంతోషంగా ఉందని.. చిత్రాన్ని త్వరలో విడుదల చేస్తామ‌ని అన్నారు.

Narne Nithin


నార్నే నితిన్, సంపద, రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కైలాష్ మీనన్, కెమెరా: దాము నర్రావుల, ఎడిటర్: మధు, పాటలు: శ్రీమణి, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్, పి అర్ ఓ:బి. వీరబాబు, సమర్పణ: రంగాపురం రాఘవేంద్ర, మురళీ కృష్ణ చింతలపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:CH. V. శర్మ, రాజీవ్ కుమార్, నిర్మాతలు: చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి, కథ,స్క్రీన్ ప్లే దర్శకత్వం: సతీష్ వేగేశ్న

Narne Nithin

Updated Date - Jun 10 , 2024 | 03:24 PM