Nara Rohith: చిన్నతిరుపతి శ్రీవారి సేవలో నారా రోహిత్ 

ABN , Publish Date - May 05 , 2024 | 03:29 PM

పశ్చిమ గోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని  హీరో నారా రోహిత్ ఆదివారం సందర్శించారు.  ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. 

Nara Rohith: చిన్నతిరుపతి శ్రీవారి సేవలో నారా రోహిత్ 

పశ్చిమ గోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని  హీరో నారా రోహిత్ ఆదివారం సందర్శించారు.  ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా ఆయన స్వామి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు పండితులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Nara.jpg

రోహిత్ ని చూసిన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మొగతడకల శ్రీనివాసరావు, ఆండ్రు అనిల్ ఓం ప్రకాష్ చౌదరి గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం నారా రోహిత్ ప్రతినిధి- 2 సినిమాతో అలరించడానికి సిద్ధం అవుతున్నారు.  ఈనెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. 

Updated Date - May 05 , 2024 | 03:35 PM