Sundarakanda: ఏ ఇద్ద‌రూ.. ఒకేలా ప్రేమించ‌లేరు! మ‌రోసారి నారావార‌బ్బాయి అద‌ర‌గొట్టాడుగా

ABN , Publish Date - Apr 17 , 2024 | 08:51 PM

కొంత‌కాలం గ్యాప్ త‌ర్వాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టిన హీరో నారా రోహిత్ త‌న‌ 20వ చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేయ‌డంతో పాటు విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించారు.

Sundarakanda: ఏ ఇద్ద‌రూ.. ఒకేలా ప్రేమించ‌లేరు! మ‌రోసారి నారావార‌బ్బాయి అద‌ర‌గొట్టాడుగా
nara roith

కొంత‌కాలం గ్యాప్ త‌ర్వాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టిన హీరో నారా రోహిత్ (Nara Rohith) వ‌రుసగా సినిమాల‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌తినిధి 2 చిత్రం విడుద‌ల‌కు రెడీ అవ‌గా తాజాగా త‌న‌ 20వ చిత్రం టైటిల్ ఎనౌన్స్ చేయ‌డంతో పాటు విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించారు. వెంకటేష్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి మరియు రాకేష్ మహంకాళి ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా “సుందరకాండ” (Sundarakanda) అనే పేరు ఫైన‌ల్ చేశారు.

na.jpeg

ప్రతి వ్యక్తికి రిలేట్ అయ్యేలా జీవితంలో ఉండే అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించే విధంగా ఈ చిత్రం ఉండబోతుండ‌గా నారా రోహిత్ (Nara Rohith) కూల్ అండ్ క్లాసీ అవతార్‌లో చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాకు సుందరకాండ (Sundarakanda) అనే టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. పోస్టర్ లో కాలేజీ విద్యార్థులు వ్యతిరేక దిశలో నడుస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ సినిమా విడుదల తేదీని కూడా నిర్మాతలు ప్రకటించగా గణేష్ చతుర్థి (సెప్టెంబర్ 7) సందర్భం గా సెప్టెంబర్ 6,2024 న ప్రేక్షకుల ముందుకి రానుంది.


సుందరకాండ (Sundarakanda) హిందూ ఇతిహాసం రామాయణంలో ఐదవ పుస్తకం. సినిమాపై పాజిటివ్ ఇంప్రెషన్‌ను క్రియేట్ చేసే ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించడానికి శ్రీరామ నవమి పర్వదినాన్ని సరైన సందర్భంగా భావించి మేకర్స్ ఈ రోజు టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ సినిమాలో వృతి వాఘని కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకి ఆనంద్ కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రదీప్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Apr 17 , 2024 | 08:51 PM