Nani: ఉగాది ప‌ర్వ‌దినం.. 'సరిపోదా శనివారం'! కొత్త పోస్ట‌ర్ వైర‌ల్‌

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:18 AM

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వ‌స్తున్న‌ పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారం. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. తాజాగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నాని, సాయి కుమార్‌లతో కూడిన కొత్త‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

Nani: ఉగాది ప‌ర్వ‌దినం.. 'సరిపోదా శనివారం'! కొత్త పోస్ట‌ర్ వైర‌ల్‌
nani

తన గత రెండు చిత్రాలు దసరా, హాయ్ నాన్నలతో పాన్ ఇండియా విజయాల్ని ఆస్వాదిస్తున్న నేచురల్ స్టార్ నాని (Nani) వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారం (Saripodha Sanivaram)తో వస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌తో హ్యుజ్ కాన్వాస్‌పై ఈ యూనిక్ అడ్రినలిన్ ఫిల్డ్ అడ్వంచర్ ని నిర్మిస్తున్నారు.

Saripodha Sanivaram

ఇంతకుముందు విడుదల చేసిన టీజర్‌ కు చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నాని, సాయి కుమార్‌లతో కూడిన బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉగాది రోజున ఇది పర్ఫెక్ట్ పోస్టర్. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్ ఇద్దరూ ఎథ్నిక్ వేర్‌లో చిరునవ్వుతో కనిపించారు.


Saripodha Sanivaram

ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) కథానాయికగా నటిస్తుండగా, ఎస్జే సూర్య (S J Suryah) కీలక పాత్రలో కనిపించనున్నారు. మురళి డీవోపీగా చేస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Apr 10 , 2024 | 10:18 AM