Smita: పాప్‌ సింగర్‌ స్మిత ఇంట్లో వైభవంగా శ్రీరామ నవమి.. నాని సందడి!

ABN , Publish Date - Apr 20 , 2024 | 04:41 PM

శ్రీరామ నవమి.. పర్వదినాన్ని పురస్కరించుకుని పాప్‌ సింగర్‌ స్మిత (Singer Smita) నివాసంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నేచురల్‌ స్టార్‌ నాని(Nani) - అంజనా (Anjana) దంపతులు సందడి చేశారు.

Smita: పాప్‌ సింగర్‌ స్మిత ఇంట్లో వైభవంగా శ్రీరామ నవమి.. నాని సందడి!



శ్రీరామ నవమి.. పర్వదినాన్ని పురస్కరించుకుని పాప్‌ సింగర్‌ స్మిత (Singer Smita) నివాసంలో సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో నేచురల్‌ స్టార్‌ నాని(Nani) - అంజనా (Anjana) దంపతులు సందడి చేశారు. కల్యాణం అనంతరం స్వామివారికి తలంబ్రాలు పోశారు. మాల మార్పిడి ఆడారు. శనివారం ఈ వీడియోను ఇన్స్టా గ్రామ్‌లో విడుదల చేశారు. అంతే కాదు నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ సినిమా విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా నాని సతీమణి అంజనా ఇన్‌స్టాలో స్పెషల్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్‌ నను భావోద్వేగానికి గురి చేశాయి. మా అబ్బాయి అర్జున్‌ ఇప్పుడిప్పుడే ‘జెర్సీ’ థీమ్‌ సాంగ్‌ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు’’ అని ఆమె పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’ సినిమా చేస్తున్నారు.  వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ కథానాయిక. ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెలతో నాని మరో సినిమా చేయబోతున్నారు. 

Updated Date - Apr 20 , 2024 | 05:20 PM