‘ఆద‌ర్శంగా ఉండ‌లేక‌పోతే.. భ‌య‌పెట్టే వాడిలా ఉండండి’.. అదిరిన క‌ళ్యాణ్ రామ్ NKR21 లుక్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:15 AM

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తాజాగా న‌టిస్తున్న కొత్త‌ చిత్రం #NKR21. ఈ రోజు క‌ళ్యాణ్ రామ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మేక‌ర్స్ సినిమా నుంచి ఓ పోస్ట‌ర్‌ విడుద‌ల చేసి ప్ర‌త్యేక పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

NKR21

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) తాజాగా న‌టిస్తున్న కొత్త‌ చిత్రం #NKR21. ప్ర‌దీప్ చిలుకూరి (Pradeep Chilukuri) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, అశోక క్రియేష‌న్స్ అశోక్ వ‌ర్ధ‌న్ ముప్పా (Ashok Vardhan), సునీల్ బులుసు (Sunil Balusu) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ రోజు క‌ళ్యాణ్ రామ్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మేక‌ర్స్ సినిమా నుంచి ఓ ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి క‌ళ్యాణ్ రామ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఆ పోస్టర్‌లో చుట్టూ మ‌నుషులు అగ్నికి అహుతై ఉండ‌గా చేతిలో నిప్పుతో క‌ల్యాణ్ రామ్ ఉన్న లుక్‌ను విడుద‌ల చేసి ‘if you canot be a good example be a terrible warning ( మీరు ఆద‌ర్శంగా ఉండ‌లేక‌పోతే భ‌య‌పెట్టే వాడిలా ఉండండి’ అంటూ డైలాగ్స్‌ ట్యాగ్ చేశారు.

NKR21


ఈ చిత్రంలో సాయి మంజ్రేక్ (Saiee Manjrekar) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, లేడీ సూప‌ర్ స్టార్‌ విజ‌య శాంతి (Vijayashanthi) ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. వీరితో పాటు బాలీవుడ్ న‌టుడు సోహైల్ ఖాన్ (Sohail Khan), శ్రీకాంత్ (Srikanth) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ ఎడాది చివ‌ర‌లో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:15 AM