Namrata, Sitara: న‌మ్ర‌త, సితార‌.. ఒక‌రితో ఒక‌రు పోటీ! వీడియో వైర‌ల్‌

ABN , Publish Date - Feb 17 , 2024 | 08:23 PM

టాలీవుడ్ ప్రిన్సెస్ టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు గారాల ప‌ట్టి సితార మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా మ‌రోసారి త‌ల్లితో క‌లిసి ఓ ప్ర‌ముఖ బ్రాండ్‌కు ప్ర‌మోష‌న్ చేస్తు విడుద‌ల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది.

Namrata, Sitara: న‌మ్ర‌త, సితార‌.. ఒక‌రితో ఒక‌రు పోటీ! వీడియో వైర‌ల్‌
sithara

టాలీవుడ్ ప్రిన్సెస్ టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు (Mahesh Babu) గారాల ప‌ట్టి సితార (Sithara Ghattamaneni) మ‌రోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా మ‌రోసారి త‌ల్లితో క‌లిసి ఓ ప్ర‌ముఖ బ్రాండ్‌కు ప్ర‌మోష‌న్ చేస్తు విడుద‌ల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. గ‌తంలోనూ ప‌లుమార్లు ఇలానే ఆడ్వ‌ర్టైజ్‌మెంట్‌ల‌లో న‌టించిన సితార ఈ సారి త‌ల్లి న‌మ్ర‌త (Namrata Shirodkar)తో క‌లిసి యాడ్ చేయ‌డం చాలా ప్రాముఖ్యం సంత‌రించుకుంది. సితార ఇప్ప‌టివ‌ర‌కు డైరెక్టుగా ఎలాంటి సినిమా చేయ‌కున్నా కేవ‌లం యాడ్స్‌, సోష‌ల్ మీడియా పోస్టుల ద్వారానే చాలా పాపులారిటీని తెచ్చుకోవ‌డ‌మేగాక‌ రూ. ల‌క్ష‌ల్లో డ‌బ్బులు వెన‌కేసుకుంటోంది.


sitara.jpg

సితార (Sithara Ghattamaneni) ఫ‌స్ట్ టైమ్‌ డిస్నీ వారి హాలీవుడ్ చిత్రం ప్రోజ‌న్ 2 కు తెలుగు డ‌బ్బింగ్ చెప్పి సినిమాల్లోకి ప‌రోక్షంగా ఎంట్రీ ఇవ్వ‌గా మ‌ర‌లా మ‌హేశ్‌బాబు (Mahesh Babu) స‌ర్కారువారి పాట చిత్రంలో పెన్నీ అనే పాట‌లో డ్యాన్స్ చేసి సితార పేరు ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుంచి త‌ల్లి న‌మ్ర‌త (Namrata Shirodkar) స‌మ‌క్షంలో ఆమె క‌ను స‌న్న‌ల్లోనే చాలా వ‌స్త్రాల‌, జ్యువెల‌రీ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే సితార చిన్న వ‌య‌స్సులోనే PMJ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సైన్ చేయ‌డ‌మే గాక ప‌లు ఫొటో షూట్స్‌, ప్రోమోష‌న్ వీడియోస్ సైతం చేసింది.

ఈ అడ్వ‌ర్టైజ్మెంట్ అమెరికా టైమ్ స్క్వైర్‌లో ప్ర‌సారం కావ‌డంతో సితార (Sithara Ghattamaneni) పేరు కొద్ది నెల‌ల పాటు దేశ‌వ్యాప్తంగా మారుమ్రోగింది. త‌ల్లి తండ్రుల‌కు త‌గ్గ త‌న‌య‌గా పేరు గ‌డించింది. అంతేగాక‌ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ నిత్యం త‌న ఫొటోషూట్ల‌ను, ప్రోమోష‌న‌ల్ వీడియోస్‌, డ్యాన్స్ వీడియోల‌ను, త‌న విదేశీ ప‌ర్య‌ట‌న వీడియోలను పోస్టు చేస్తూ నెల‌కు రూ.30 ల‌క్ష‌ల పైనే సంపాదిస్తున్న‌ట్లు నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Updated Date - Feb 17 , 2024 | 09:22 PM