Namo: యంగ్ టీమ్‌తో వస్తోన్న ఈ సినిమా సక్సెస్ కావాలి..

ABN , Publish Date - Jun 04 , 2024 | 11:23 PM

విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా విస్మయ శ్రీ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల‌పై ఏ. ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దమైన నేపథ్యం మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.

Namo: యంగ్ టీమ్‌తో వస్తోన్న ఈ సినిమా సక్సెస్ కావాలి..
Namo Pre Release Event

విశ్వంత్ దుద్దంపూడి, అనురూప్ కటారి హీరోలుగా విస్మయ శ్రీ హీరోయిన్‌గా శ్రీ నేత్ర క్రియేషన్స్, ఆర్మ్స్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ల‌పై ఏ. ప్రశాంత్ నిర్మించిన చిత్రం ‘నమో’. ఈ చిత్రంతో ఆదిత్య రెడ్డి కుందూరు దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ జూన్ 7న విడుదలకు సిద్దమైన నేపథ్యం మేకర్స్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ వంటి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆదిత్య నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈ చిత్రంతో ఆదిత్య దర్శకుడిగా పరిచయం అవుతుండటం ఆనందంగా ఉంది. అతను ఎంతో కష్టపడతాడు. మంచి టాలెంట్ ఉంది. ఆదిత్య ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటాడనిపిస్తోంది. సినిమాలోని పాత్రలు కష్టాలు పడుతుంటే.. చూసే ప్రేక్షకులకు ఫన్ వస్తుంటుంది. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలను థియేటర్ వరకు తీసుకు రావడమే గొప్ప విషయం. యంగ్ టీం కలిసి చేసిన ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరగా.. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. నన్ను పెద్ద సినిమా ఫంక్షన్‌లకు పిలిచినా వెళ్తాను. చిన్న సినిమా ఈవెంట్‌లకు ఆహ్వానించినా వస్తాను. కానీ చిన్న చిత్రాల ప్రమోషన్స్‌కి వస్తే.. వారికి ఎంతో సాయం చేసినట్టుగా అవుతుంది. హీరోయిన్ విస్మయ శ్రీ తెలుగమ్మాయి. ఇప్పటికే నాలుగు సినిమాలు చేసింది. మంచి స్టార్ హీరోయిన్ అయ్యే సత్తా ఉన్న నటి. కొత్త దర్శక, నిర్మాతలు ఇప్పుడు ఎక్కువగా ఇండస్ట్రీలో సినిమాలు తీస్తున్నారు. కథను నమ్మి సినిమాలు తీసే దర్శక నిర్మాతలకు ఎప్పుడూ విజయం చేకూరాలి. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఆదిత్యకు ఆల్ ది బెస్ట్. విశ్వంత్ మంచి నటుడు. మంచి టాలెంట్ ఉన్న నటుడు. ఆయనకు ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని అన్నారు.


చిత్ర దర్శకుడు ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ.. మా ఈవెంట్‌కు వచ్చిన గురువు భీమనేని శ్రీనివాసరావు, బెక్కం వేణుగోపాల్ గారికి థాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రశాంత్ గారు సినిమాను నిర్మించారు. మంచి కథకి, సబ్జెక్ట్‌కి విశ్వంత్ లాంటి మంచి హీరో దొరకడంతోనే ‘నమో’ సినిమాగా మారింది. అనురూప్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. విస్మయ మంచి నటి. రాహుల్ శ్రీ వాస్తవ గారు మంచి విజువల్స్ ఇచ్చారు. ట్రైబల్ సెట్‌ను కిరణ్ కుమార్ అద్బుతంగా వేశారు. క్రాంతి ఆచార్య నాకు చిన్నతనం నుంచి స్నేహితుడు. చక్కని సంగీతం ఇచ్చారు. నా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. అందరూ వీక్షించి విజయవంతం చేయండని కోరారు. నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ.. ఆదిత్య, డీఓపీ రాహుల్ నాకు మంచి స్నేహితులు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ నిర్మించాను. ఆ ఇద్దరికి సినిమా అంటే ఎంతో ప్యాషన్. విశ్వంత్, అనురూప్, విస్మయలు చాలా కష్టపడతారు. రిమోట్ ఏరియాలో టీం అంతా కష్టపడింది. క్రాంతి ఆచార్య మంచి సంగీతాన్ని ఇచ్చారు. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ఆద్యంతం నవ్విస్తూనే ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు, రోమ్ భీమన వంటి వారు మాట్లాడారు.

Updated Date - Jun 04 , 2024 | 11:23 PM