Shobha Shetty: ఆరో వారం అడిగితే.. 14వ వారంలో... గుర్తు పెట్టుకుని మరీ..! 

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:55 PM

శోభాశెట్టి పరిచయం అక్కర్లేని పేరు. ‘కార్తీక దీపం’ సీరియల్‌తో మోనితగా అలరించిన ఆమె బిగ్‌బాస్‌ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో తన ఆటతో, అందంతో హౌస్‌లో ఓ రేంజ్‌లో ఆట ఆడింది

Shobha Shetty: ఆరో వారం అడిగితే.. 14వ వారంలో... గుర్తు పెట్టుకుని మరీ..! 

శోభాశెట్టి (Shobha Shetty) పరిచయం అక్కర్లేని పేరు. ‘కార్తీక దీపం’ (Karthika deepam)సీరియల్‌తో మోనితగా అలరించిన ఆమె బిగ్‌బాస్‌ సీజన్ 7(Biggboss7)లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్‌లో తన ఆటతో, అందంతో హౌస్‌లో ఓ రేంజ్‌లో ఆట ఆడింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్‌ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్‌ చూసి ముచ్చటపడింది శోభాశెట్టి. ఆ షర్ట్‌ కావాలని అడిగింది. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నాగార్జున నిజంగానే ఆ డ్రెస్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభాశెట్టి తన యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వెల్లడించింది. ఆ మేరకు ఆమె మాట్లాడుతూ ‘అది ఆరో వారంలో అనుకుంటా. నాగార్జున ధరించిన టీ షర్ట్‌ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్‌ అయ్యాను. నేను టీ షర్ట్‌ అడిగిన విషయం గుర్తు పెట్టుకుని మరీ ఎలిమినేట్‌ అయిన రోజు నాగ్‌ సర్‌ స్వయంగా ఆ టీ షర్ట్‌ నాకు ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్‌ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్‌ కూడా చేశాను’ అంటూ తన షూట్‌ ఎలా జరిగిందో వీడియోలో చూపించింది. ఇది చూసిన జనాలు అనుకున్నది సాధించింది శోభా అని కామెంట్లు చేస్తున్నారు. 

Updated Date - Jan 05 , 2024 | 06:57 PM