ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' కీలక షెడ్యూల్ ప్రారంభం

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:50 PM

త‌మిళ స్టార్ ధనుష్, 'కింగ్' నాగార్జున , కాంబినేష‌న్‌లో శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ 'కుబేర' చిత్రం కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభ‌మైంది.

ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' కీలక షెడ్యూల్ ప్రారంభం
kubera

త‌మిళ స్టార్ ధనుష్ (Dhanush), 'కింగ్' నాగార్జున (Nagarjuna), కాంబినేష‌న్‌లో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ 'కుబేర' చిత్రం కీలక & లెన్తీ షూటింగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభ‌మైంది. గత నెలలో ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ తర్వాత 'కుబేర' (Kubera)సినిమాపై అంచ‌నాలు రెట్టింపయ్యాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ (Dhanush) ఫస్ట్ లుక్‌లో ఊహించని అవతార్‌లో కనిపించారు. కింగ్ నాగార్జున (Nagarjuna) అక్కినేని క్లాస్ అవతార్‌లో కనిపిస్తున్న బ్యాంకాక్ షెడ్యూల్ నుంచి స్నీక్ పీక్ మరొక పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది. వర్కింగ్ స్టిల్స్‌లో నాగ్ లుక్ రివీల్ కానప్పటికీ, అతనిని స్టైలిష్ లుక్‌లో చూసి అభిమానులు ఫిదా అయ్యారు.

రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్‌లను అందించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రతిష్టాత్మకంగా 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna)లను లీడ్ పాత్రలకు ఎంపిక చేయడం ఈ చిత్రానికి మొదటి విజయం. అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఏషియన్ గ్రూప్) బ్యానర్‌పై శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు.

kub.jpeg


సినిమా చుట్టూ ఉన్న బజ్‌ని దృష్టిలో ఉంచుకుని, శేఖర్ కమ్ముల అండ్ టీమ్ చాలా జాగ్రత్తతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ మ్యాసీవ్ షెడ్యూల్ 12 రోజుల పాటు నగరంలోని వివిధ ప్రదేశాలలో షూట్ చేస్తున్నారు. ఇది కీలకమైన, లెన్తీ షెడ్యూల్. ఈ షెడ్యూల్ లో ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika Mandanna), ఇతరులతో కూడిన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్స్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు చిత్రీకరిస్తున్నారు. టీమ్ విడుదల చేసిన వర్కింగ్ స్టిల్‌లో ధనుష్ వాటర్ పైప్‌లైన్ పైన నిలబడి ఉన్నట్లు ప్రజెంట్ చేస్తోంది.

kubera.jpg

ఈ ఏడాది వస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో హై బడ్జెట్‌తో రూపొందిన సినిమాల్లో కుబేర ఒకటి. ఇంతకుముందు సెన్సిబుల్, కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ చేసిన శేఖర్ కమ్ముల (Sekhar Kammula) అన్ని కమర్షియల్ హంగులతో, కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆశ్చర్య పరచబోతున్నారు. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) అభిమానులు తమ అభిమాన స్టార్స్ ని కలిసి తెరపై చూడాలని క్యురియాసిటీతో ఉన్నారు. వీరితో పాటు రష్మిక పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉండ‌నుంది. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 09:50 PM