Nagarjuna: ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి భంగపాటు!

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:35 AM

అభిమాన హీరో కనిపిస్తే సరదాగా మాట్లాడాలని, ఒక ఫొటో తీసుకోవాలని ఫ్యాన్స్ (Fans hungama) ఆరాటపడుతుంటారు. అవకాశం కుదిరితే అంతా బాగానే ఉంటుంది. అలా జరగని సమయంలో అవమానం పాలు కావాల్సి ఉంటుంది.

Nagarjuna: ఎయిర్‌పోర్ట్‌లో అభిమానికి భంగపాటు!


అభిమాన హీరో కనిపిస్తే సరదాగా మాట్లాడాలని, ఒక ఫొటో తీసుకోవాలని ఫ్యాన్స్ (Fans hungama) ఆరాటపడుతుంటారు. అవకాశం కుదిరితే అంతా బాగానే ఉంటుంది. అలా జరగని సమయంలో అవమానం పాలు కావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అభిమానుల సందడి చూసి సెలబ్రిటీలే దగ్గరకు వెళ్లి సెల్ఫీ ఇస్తుంటారు. మరి కొన్ని సార్లు సెక్యూరిటీ సిబ్బంది చేతిలో అభిమానులకు భంగపాటు తప్పదు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. అక్కినేని నాగార్జున (Nagarjuna) ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తుండగా ఓ అభిమాని కలిసేందుకు ముందుకు దూసుకువచ్చాడు. అయితే క్షణాల్లో తేరుకున్న సిబ్బంది ఒకరు సదరు వ్యక్తిని పక్కకు లాగేశాడు. ఆ సమయంలో ఈ విషయం నాగార్జున దృష్టికి వచ్చినట్లు వీడియో లో కనిపించలేదు. ఈ ఘటనను వీడియో తీసిన  ఓ వ్యక్తి ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశాడు. అది నాగార్జున దృష్టికి వెళ్లగా ఆయన నాగార్జున స్పందించారు. విచారం వ్యక్తం చేశారు. 

‘‘ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ ఘటన నా దృష్టికి వచ్చింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. సదరు అభిమానికి నేను క్షమాపణలు చెబుతున్నా. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటా’’ అని ట్వీట్‌ చేశారు.  దీనిని పాజిటివ్‌గా తీసుకున్న కొందరు పొరపాట్లు సహజం అని కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం అభిమానుల్ని అంత తక్కువగా చూడకూడదు సర్‌’ అని కామెంట్లు పెడుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న సందర్భంలో నాగార్జునతోపాటు తమిళ హీరో ధనుష్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం నాగార్జున, ధనుష్‌ కీలక పాత్రధారులుగా కుబేర’ చిత్రం తెరకెక్కుతుంది. శేఖర్‌ కమ్ముల ఈ చిత్రానికి దర్శకుడు.  

Updated Date - Jun 24 , 2024 | 11:46 AM