Kubera: కంటైనర్‌ నిండా నోట్ల కట్టలు.. అదిరిన నాగార్జున‌ ‘కుబేర’ లుక్‌

ABN , Publish Date - May 03 , 2024 | 10:12 AM

ధనుష్ , నాగార్జున కాంబినేష‌న్‌లో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకక్కుతోన్న చిత్రం ‘కుబేర’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు.

Kubera: కంటైనర్‌ నిండా నోట్ల కట్టలు.. అదిరిన నాగార్జున‌ ‘కుబేర’ లుక్‌
kubera

ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna Akkineni) కాంబినేష‌న్‌లో స్పెషాలిటీ ద‌ర్శ‌కుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో తెరకక్కుతోన్న చిత్రం ‘కుబేర’ (Kubera). ఇప్ప‌టికే విడుదల చేసిన గ్లిమ్స్ పినిమాపై విప‌రీత‌మైన క్యూరియాసిటీని పెంచేస్తుండ‌గా తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఆప్డేట్ ఇచ్చారు. సినిమా నుంచి కింంగ్ నాగార్జున ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేయ‌డ‌మే కాకుండా సినిమా థీమ్‌ను వివ‌రించేలా వీడియోను డిస్నీ ఫ్ల‌స్ హాట్‌స్టార్‌లో విడుద‌ల చేశారు.

kubera.jpg


ఈ వీడియోలో.. భారీ వ‌ర్షం ప‌డుతుండ‌గా నిండా డ‌బ్బుల‌తో ఉన్న కంటైన‌ర్ల‌ మ‌ధ్య నాగార్జున (Nagarjuna Akkineni) గొడుగుతో నిల్చుని కింద ప‌డి ఉన్న రూ.500 నోట్ల‌ను కంటైన‌ర్‌లో పెట్ట‌డాన్ని చూయిస్తూ సినిమాపై ఆస‌క్తి పెరిగేలా చేశారు. ఈ ‘కుబేర’ (Kubera) సినిమా షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా ఈ సంవ‌త్స‌రం ద‌స‌రాకు గానీ దీపావ‌ళికి గానీ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

nagarjuna.jpeg

పాన్ ఇండియా సినిమాగా వ‌స్తున్న ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కర్‌ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తుండ‌గా, రష్మిక మందన్న (Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోంది, దేవిశ్రీప్రసాద్ (DEVI SRI PRASAD) సంగీతం అందిస్తున్నారు.

Updated Date - May 03 , 2024 | 10:12 AM