మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Thandel Reel: చై, సాయి పల్లవి రీల్‌ అదిరింది!

ABN, Publish Date - Feb 14 , 2024 | 12:27 PM

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్‌’. చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Thandel Reel:  చై, సాయి పల్లవి రీల్‌ అదిరింది!


అక్కినేని నాగచైతన్య (Naga chaitanya), సాయి పల్లవి 9Sai pallavi) జంటగా నటిస్తున్న చిత్రం 'తండేల్‌’ (Thandel). చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.  చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్‌కి చక్కని స్పందన వచ్చింది. బుధవారం ప్రేమికుల రోజు సందర్భంగా సాయి పల్లవి, అభిమానులకు బ్యూటిఫుల్‌ గిప్ట్‌ ఇచ్చారు. గ్లింప్స్‌లో 'బుజి తల్లి వచ్చేత్తనా కదే’.. కాస్త నవ్వే’ అనే డైలాగ్‌ని  రీ క్రియేట్‌ చేసి వాలెంటైన్స్ డే  గిఫ్ట్‌గా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.  

Thandel-2.jpg

ఈ వీడియో పోస్ట్‌ చేసిన నాగచైతన్య.. "గ్లింప్స్‌కు వచ్చిన స్పందన అద్భుతం. ఈ గ్లింప్స్‌ చూసి చాలామంది సొంతగా రీల్స్‌గా కూడా చేస్తున్నారు. అందుకే నేను, సాయిపల్లవి కలిసి ఈ రీల్‌ చేసి మీకు అందించాలనుకున్నాం. ప్రతి రోజు ప్రేమను సెలబ్రేట్‌ చేసుకోండి’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. చై, సాయి పల్లవి చేసిన  రీల్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సాయి పల్లవి జపాన్ లో ఓ హిందీ సినిమా చిత్రీకరణలో ఉన్నారు, అక్కడి నుంచే ఆమె ఈ రీల్ చేసినట్లు తెలుస్తోంది.

Updated Date - Feb 14 , 2024 | 12:27 PM