మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nag Ashwin: విశ్వక్ సేన్ 'గామి' కోసం.. ఎదురుచూస్తున్నా

ABN, Publish Date - Feb 12 , 2024 | 08:52 PM

మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. ఇటీవ‌ల రిలీజ్ డేట్ పోస్టర్, గ్లిమ్స్‌ ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే ఈ పోస్టర్‌లను చూసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గామి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

gaami

మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి (Gaami). విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో అందరి ప్రశంసలు అందుకుంది. క్రౌడ్ ఫండ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.


అయితే ఈ పోస్టర్‌లను చూసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) గామి చిత్ర యూనిట్‌ను అభినంద‌స్తూ.. ఈ టీం చాలా ఓపిక‌గా ‘చాలా ఓపికగా, ప్రేమతో.. ఎంతోకాలం శ్రమించి.. సాధించారు. సినిమా కోసం నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, గామి (Gaami) మార్చి 8న థియేటర్లలో” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా ఈ పోస్టు నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఇదిలాఉండ‌గా మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్‌ జోరుని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీంకు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చెప్పిన ఉత్తేజకరమైన మాటలుబ‌లాన్ని చూకూర్చాయి.

ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ (Abhinaya), హారిక పెడాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తుండగా.. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూర్చారు.

Updated Date - Feb 12 , 2024 | 08:52 PM