Nag Ashwin: విశ్వక్ సేన్ 'గామి' కోసం.. ఎదురుచూస్తున్నా

ABN , Publish Date - Feb 12 , 2024 | 08:52 PM

మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. ఇటీవ‌ల రిలీజ్ డేట్ పోస్టర్, గ్లిమ్స్‌ ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. అయితే ఈ పోస్టర్‌లను చూసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ గామి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

Nag Ashwin: విశ్వక్ సేన్ 'గామి' కోసం..  ఎదురుచూస్తున్నా
gaami

మాస్‌ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి (Gaami). విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో, కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రం ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ తో అందరి ప్రశంసలు అందుకుంది. క్రౌడ్ ఫండ్ తో తెరకెక్కిన ఈ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.


WhatsApp Image 2024-02-12 at 6.26.11 PM.jpegఅయితే ఈ పోస్టర్‌లను చూసిన స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) గామి చిత్ర యూనిట్‌ను అభినంద‌స్తూ.. ఈ టీం చాలా ఓపిక‌గా ‘చాలా ఓపికగా, ప్రేమతో.. ఎంతోకాలం శ్రమించి.. సాధించారు. సినిమా కోసం నేను ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని, గామి (Gaami) మార్చి 8న థియేటర్లలో” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌గా ఈ పోస్టు నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఇదిలాఉండ‌గా మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్‌ జోరుని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్న ఈ సినిమా టీంకు నాగ్ అశ్విన్ (Nag Ashwin) చెప్పిన ఉత్తేజకరమైన మాటలుబ‌లాన్ని చూకూర్చాయి.

ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ (Abhinaya), హారిక పెడాడ, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తుండగా.. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూర్చారు.

Updated Date - Feb 12 , 2024 | 08:52 PM