మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nag Ashwin: భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందంటే..!  

ABN, Publish Date - Feb 26 , 2024 | 12:03 PM

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ (kalki 2989 ad) చిత్రం గురించి దర్శకుడు నాగ్‌ అశ్విన్ (Nag Aswin) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా నాగ్‌ అశ్విన్‌ సినాప్స్‌ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్‌ మీట్‌లో పాల్గొన్నారు

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘కల్కి 2989 ఏడీ’ (kalki 2989 ad) చిత్రం గురించి దర్శకుడు నాగ్‌ అశ్విన్ (Nag Aswin) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాజాగా నాగ్‌ అశ్విన్‌ సినాప్స్‌ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్‌ మీట్‌లో పాల్గొన్నారు. అక్కడ 'కల్కి' గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

"మహాభారతం’, స్టార్‌ వార్స్‌... రెండింటినీ చూస్తూ, వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక గొప్ప సినిమా చేయాలనుకున్నప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ పుట్టింది. ఈ సినిమా కూడా మహాభారతం కాలం నుంచి మొదలై 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్‌ పెట్టాం. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. సినిమాలో ప్రధానమైన పాత్రలన్నీ ఇండియన్‌ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. ఈ క్రమంలోనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్‌ చేశాం.’ అని తెలిపారు.

ఈ ఏడాది మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె కథానాయికగా నటిస్తుండగా కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి.అశ్వినీదత నిర్మిస్తున్నారు. తాజాగా ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది.

Updated Date - Feb 26 , 2024 | 12:04 PM