G.V.Prakash Kumar: నాని ద‌స‌రా సినిమాలో.. అ క్యారెక్ట‌ర్ నేను చేయాల్సింది

ABN , Publish Date - Apr 08 , 2024 | 06:41 PM

జీవీ ప్ర‌కాశ్ కుమార్ తాజాగా న‌టించిన చిత్రం డియ‌ర్‌. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ విడుద‌ల చేస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌కాశ్ త‌న‌ తెలుగు సినిమా ఆఫ‌ర్ల గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

G.V.Prakash Kumar: నాని ద‌స‌రా సినిమాలో.. అ క్యారెక్ట‌ర్ నేను చేయాల్సింది
gv prakash

నాని (Nani) హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన ద‌స‌రా (Dasara.) సినిమాలో సూరి పాత్ర‌లో న‌టించే అవ‌కాశం వ‌చ్చింద‌ని కానీ నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో నా డేట్స్ కుద‌ర‌లేద‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, హీరో జీవీ ప్ర‌కాశ్ కుమార్ (G.V.Prakash Kumar) అన్నారు. త‌ను తాజాగా న‌టించిన డియ‌ర్ (DeAr) విడుద‌ల నేప‌థ్యంలో సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. తెలుగు నాట ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన అన్న‌పూర్ణ విడుద‌ల చేస్తుండ‌గా నాగ చైత‌న్య వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

dear

జీవీ ప్ర‌కాశ్ కుమార్ హీరోగా, తెలుగమ్మాయి ఐశ్వ‌ర్యా రాజేశ్ (aishwarya rajesh) క‌థానాయిక‌గా న‌టించిన చిత్రం డియ‌ర్ (DeAr) గ‌తంలో వ‌చ్చిన గుర‌క కాన్సెప్ట్‌లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 11న త‌మిళంలో విడుద‌ల‌వుతుండ‌గా 12న తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ప్ర‌చార చిత్రాలు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలను భారీగా పెంచేశాయి. ఈ క్ర‌మంలో ఈ రోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు , మీడియాతో ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి విలేఖ‌రుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.


dear

ఈ సంద‌ర్బంగా ఓ విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు జీవీ ప్ర‌కాశ్ కుమార్ (G.V.Prakash Kumar) మాట్లాడుతూ.. నాకు తెలుగులో అవ‌కాశాలు వ‌స్తున్నాయి కానీ త‌మిళంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, హీరోగా బిజీగా ఉండ‌డంతో తెలుగు సినిమాలు అంగీక‌రించ లేకపోయాన‌ని త్వ‌ర‌లో తెలుగులో స్టెయిట్ సినిమా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ల‌క్కీ భాస్క‌ర్‌, రాబిన్ హుడ్ వంటి నాలుగైదు తెలుగు చిత్రాల‌కు సంగీతం అందిస్తున్నాన‌ని తెలిపారు.

Updated Date - Apr 08 , 2024 | 06:41 PM