మ‌రోసారి తండ్రైన సింగ‌ర్ సాగ‌ర్‌.. దేవీశ్రీ ప్ర‌సాద్ ఇంట సెల‌బ్రేష‌న్స్‌

ABN , Publish Date - Feb 22 , 2024 | 09:36 PM

ప్రముఖ నేప‌థ్య గాయ‌కుడు టాలీవుడ్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ (Sagar) మ‌రోసారి తండ్రి అయ్యారు. ఆయ‌న భార్య డా. మౌనిక పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. విష‌యం తెలుసుకున్న టాలీవుడ్ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

మ‌రోసారి తండ్రైన సింగ‌ర్ సాగ‌ర్‌.. దేవీశ్రీ ప్ర‌సాద్ ఇంట సెల‌బ్రేష‌న్స్‌
sagar

టాలీవుడ్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుడు దేవీ శ్రీ ప్ర‌సాద్ సోద‌రుడు.. ప్రముఖ నేప‌థ్య గాయ‌కుడు సాగ‌ర్ (Sagar) మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య డా. మౌనిక పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆ జంటకు టాలీవుడ్ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. వీరికి మొద‌ట సంతానం అబ్బాయి కాగా రెండో సారి కూడా అబ్బాయి జ‌న్మించ‌డం విశేషం.

GG8rIbhbcAAxxwf.jpg


ఇదిలాఉండ‌గా సాగ‌ర్ నేప‌థ్య గాయ‌కుడిగా అన్న దేవీ ప్ర‌సాద్ సంగీతంలో చాలా పాట‌లు పాడారు. ఇంకా చెప్పాలంటే డీఎస్పీ సంగీతం అందించే ప్ర‌తి సినిమాలో సాగ‌ర్‌తో ఓ పాట పాడించ‌డం ఆన‌వాయితీగా ఉంటుంది.

2023 సెప్టెంబ‌ర్ 18న జ‌రిగిన‌ సాగ‌ర్ కుమారుడి ప్ర‌థ‌మ పుట్టిన‌రోజు వేడుక‌లు దేవీశ్రీ ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో గ్రాండ్‌గా నిర్వ‌హించ‌గా అప్పుడు ఆ ఫొటోలు నెట్టింట బాగా వైర‌ల్ అయ్యాయి.

Updated Date - Feb 23 , 2024 | 06:07 PM