Mohan Lal: అయ్యో ఆ స్టార్ హీరో కొడుకుకి ఏమైంది.. ఆ పనులు చేస్తున్నాడేంటి

ABN, Publish Date - Nov 12 , 2024 | 07:40 AM

మాలీవుడ్ సూపర్ స్టార్ 'మోహన్ లాల్' కొడుకు 'ప్రణవ్ మోహన్ లాల్'. ప్రస్తుతం స్పెయిన్‌లో వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. అదికూడా ఎలాంటి శాలరీ లేకుండా. ఆయనకి అంత కష్టం ఎందుకు వచ్చింది. ప్రణవ్ తల్లి ఏమందంటే..

Mohan Lal: అయ్యో ఆ స్టార్ హీరో కొడుకుకి ఏమైంది.. ఆ పనులు చేస్తున్నాడేంటి

మలయాళ చిత్ర పరిశ్రమని ఒంటిచేత్తో ఏలే హీరో 'మోహన్ లాల్'. ఈ వయసులోనూ అద్భుతమైన పాత్రలతో సూపర్ డూపర్ హిట్లు సాధిస్తూ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే వందల కోట్ల ఆస్తిని కూడగట్టారు. కష్ట పడకుండానే తన నెక్స్ట్ జెనరేషన్స్ పూల బాటలో నడిచే వనరులన్నీ కల్పించారు. తన కొడుకుని కూడా ఇండస్ట్రీ కి పరిచయం చేసి అద్భుతమైన కెరీర్ అందించే ప్రయత్నం చేశాడు. కానీ.. ఆయన కొడుకు దేశం వదిలి వెళ్ళాడు. విదేశాల్లో కూలి పనులు చేస్తున్నాడు. అయ్యో అతనికేం అంత కష్టం వచ్చింది అనుకుంటున్నారా. ఇంతకీ ఏమైందంటే..


మాలీవుడ్ సూపర్ స్టార్ 'మోహన్ లాల్' కొడుకు 'ప్రణవ్ మోహన్ లాల్'. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమై అద్భుతమైన స్క్రీన్ రైటర్‌గా ఎదిగాడు. తర్వాత నటుడిగా మారి 'హృదయం', 'వర్షంగళ్కు శేషం' సినిమాలతో మంచి పేరు సంపాదించుకోవడమే కాకుండా సూపర్ డూపర్ హిట్స్ సాధించాడు. అయితే ఆయన ప్రస్తుతం కెరీర్ నుంచి కాస్త గ్యాప్ తీసుకొని స్పెయిన్‌కి చెక్కేసాడు. అక్కడ ఏ విహారానికో, పార్టీలకో వెళ్ళలేదు. అక్కడ వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా ప్రణవ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.


స్పెయిన్‌లో ఒక అగ్రికల్చర్ ఫామ్ లో ప్రణవ్ ప‌నికి చేరాడట. అక్కడ గొర్రెలు కాయ‌డం, గుర్రాల‌ను చూసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నాడ‌ట‌. ఇందుకు గానూ జీతం కూడా ఏమీ లేద‌ని, కేవ‌లం భోజ‌నం పెట్టి, ఆ ఫామ్‌లోనే షెల్ట‌ర్ ఇస్తార‌ని ప్ర‌ణ‌వ్ త‌ల్లి ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పింది. ఆ పనులు చేయడాన్ని ప్రణవ్ ఆస్వాదిస్తాడని ఆమె తెలిపింది. ఆమె మాత్రం ప్రణవ్‌ని ఇంకా చాలా సినిమాల్లో చూడాలని కోరుకుంటున్న అని చెప్పింది.

Also Read-Tollywood Stars: అందరు స్టార్స్ మాల్దీవుల్లోనే.. ఎం జరుగుతుందంటే

Also Read-Allu Arjun Fans: ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్‌పై ఫ్యాన్స్ దాడి.. పుష్ప 2

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 12 , 2024 | 07:40 AM