Mohanlal: మోహన్‌లాల్ '1000 కోట్ల' సినిమా రెడీ..

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:13 PM

మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్ భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంతకీ ఆ '1000 కోట్ల' సినిమా ఏంటంటే..

మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '1000 కోట్లు'. గతంలో '100 కోట్లు'వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం ఈ '1000 కోట్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుత ఈ మూవీ కేరళ‌లో డబ్బింగ్ జరుపుకుంటుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కాసుల రామకృష్ణ మాట్లాడుతూ.. "మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో '1000 కోట్లు' పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్.. మోహన్ లాల్‌కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు.ఈ చిత్రానికి ప్రముఖ పీఆర్‌ఓ వీరబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అని అన్నారు.

WhatsApp Image 2024-11-30 at 15.55.23.jpegWhatsApp Image 2024-11-30 at 15.55.23 (1).jpegWhatsApp Image 2024-11-30 at 15.55.24.jpeg

Also Read-Suma Kanakala: సుమ పోస్టు చూశారా.. దీని వెనుక ఆంతర్యమేమిటి


మోహన్ లాల్, కావ్య మాధవన్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం రాతీష్ వేగ అందిస్తున్నారు. డిఓపిగా ప్రదీప్ నాయర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గా బాసింశెట్టి వీరబాబు, నిర్మాతలుగా కాసుల శ్రీకర్ గుప్తా, కాసుల రామకృష్ణ వ్యవహరిస్తుండగా జోషి దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read-RC 16: చరణ్ వర్సెస్ మున్నా భయ్యా.. మీర్జాపూర్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2024 | 05:14 PM