మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mohan Babu: మనసంతా ఆవేదనతో నిండిపోయింది!

ABN, Publish Date - Jun 08 , 2024 | 02:27 PM

మీడియా మొగల్‌ రామోజీరావు (Ramojirao) మరణవార్త విన్న మంచు మోహన్ బాబు (mohanbabu) భావోద్వేగానికి గురయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. "

Mohan Babu:  మనసంతా ఆవేదనతో నిండిపోయింది!

మీడియా మొగల్‌ రామోజీరావు (Ramojirao) మరణవార్త విన్న మంచు మోహన్ బాబు (mohanbabu) భావోద్వేగానికి గురయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. "రామోజీరావు మహోన్నత వ్యక్తి. పత్రికా రంగంలో రారాజు, అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్‌సిటీని మన దేశంలో నిర్మించారు. ఆయన విజన, ఆలోచనా విధానం చాలా గొప్పది. ఆయనకు, నాకూ 42 ఏళ్ల నుంచి ఆత్మీయ సంబంధం ఉంది. ఎంతో ఆత్మీయంగా పలకరిస్తారు. మంచి విషయాలు చెబుతారు. నేను ఆయన దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అటువంటి గొప్ప వ్యక్తి మన మధ్య లేరంటే నమ్మలేకపోతున్నా. మనసు చాలా ఆవేదనతో నిండిపోయింది. నా కుటుంబానికే కాదు. సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఇది మాటల్లో చెప్పలేనిది. వారు ఎక్కడున్న వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

నిర్మాతల మండలి, వాణిజ్య మండలి సంతాపం

తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అన్ని విభాగములకు సంబంధించిన ఆఫీస్‌ బేరర్లు, కార్యవర్గ సభ్యులు రామోజీ రావు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ రావు మృతికి గౌరవ సూచకంగా ఆదివారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాల్లో  టాలీవుడ్‌లో అన్ని కార్యకలాపాలు మూసివేయబడతాయని పేర్కొన్నారు. అలాగే నిర్మాతల మండలి సభ్యులు కూడా రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సభ్యులు.
   
 




Updated Date - Jun 08 , 2024 | 02:27 PM