Aarambham: మే 10న. థియేట‌ర్ల‌లోకి.. ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం

ABN , Publish Date - Apr 23 , 2024 | 07:48 PM

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

 Aarambham: మే 10న. థియేట‌ర్ల‌లోకి.. ఎమోషనల్ థ్రిల్లర్ ఆరంభం
aarambham

మోహన్ భగత్ (Mohan Bhagat), సుప్రిత సత్యనారాయణ్ (Supritha Satyanarayana), భూషణ్ కళ్యాణ్ (Bhushan Kalyan), రవీంద్ర విజయ్ (Ravindra Vijay) కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం"(Aarambam). ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి (Ajay Nag) దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" చిత్ర రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

GFaXDQRagAAVB0L.jpeg


అనౌన్స్ మెంట్ నుంచి "ఆరంభం" సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజ‌ర్ల‌తో పాటు అనగా అనగా అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను హీరో శ్రీ విష్ణు రిలీజ్ చేయ‌గా మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది. మ‌నం ఇదివ‌ర‌కు చూడ‌ని వైవిధ్యమైన కథా కథనాలతో ఓ డిఫరెంట్ మూవీ చూసిన ఎక్సీపిరియన్స్ ను "ఆరంభం" (Aarambam) ప్రేక్షకులకు ఇవ్వబోతోంది.

Updated Date - Apr 23 , 2024 | 07:48 PM