𝐑𝐀𝐉𝐀ది𝐑𝐀𝐉𝐀: ప్ర‌కృతితో రిలేట్ అయిన కథతో ’రాజా ది రాజా’.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:07 PM

రుత్విక్ కొండకింది, విశాఖ దిమాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రాజా ది రాజా. ఈ సినిమా ఇవాళ (సోమ‌వారం) హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవి బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

RAJA

రుత్విక్ కొండకింది (Ruthvik Kondakindi), విశాఖ దిమాన్ (Vishaka Dhiman ) హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం చేస్తు వ్రిందావన్ క్రియేషన్స్ (Vrindavan Creations) తొలిసారి నిర్మిస్తోన్న చిత్రం రాజా ది రాజా (𝐑𝐀𝐉𝐀ది𝐑𝐀𝐉𝐀). ఈ సినిమా ఇవాళ (సోమ‌వారం) హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవి బాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమాకు మణికాంత్ గెల్లి (Manikanth Gelli) దర్శకత్వం వహిస్తుండ‌గా చాణక్య (Chanakya) అద్దంకి, నిహారిక రెడ్డి (Niharika Reddy) నిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

WhatsApp Image 2024-02-05 at 4.22.03 PM.jpeg

ఈ సందర్భంగా దర్శకుడు మణికాంత్ గెల్లి మాట్లాడుతూ తెల్లవారితే గురువారం సినిమా తర్వాత ఓ మంచి లవ్ స్టోరిని, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాన‌న్నారు. ప్ర‌కృతితో రిలేట్ అయిన ఉన్న ఒక పాయింట్ కథలో ఉంటుంద‌ని,రాజా ది రాజా (𝐑𝐀𝐉𝐀ది𝐑𝐀𝐉𝐀) పూర్తి కమర్షియల్ సినిమా కాకపోయినా ఆ స్థాయిలో వర్కవుటయ్యేలా రూపొందిస్తున్నాం అన్నారు.


ప్రొడ్యూసర్ చాణక్య అద్దంకి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత గెస్ట్ గా వచ్చిన ఫస్ట్ మూవీ ఓపెనింగ్ మాదే అన్నారు. రాజా ది రాజా (𝐑𝐀𝐉𝐀ది𝐑𝐀𝐉𝐀) సినిమాను నేచర్ కు దగ్గరగా ఉన్న ఒక పాయింట్ తో నిర్మిస్తున్నామ‌న్నారు. ఫ్రెండ్లీగా ఉండే టీమ్ కుదిరిందని,. రేపటి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నామ‌న్నారు. రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి మే జూన్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామ‌ని, మీ అందరి సపోర్ట్ కావాలని కోరారు.

GFjjR8YWUAAKtQ4.jpg

హీరో రుత్విక్ కొండకింది మాట్లాడుతూ ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నాం. ఒక మంచి సినిమారాజా ది రాజా (𝐑𝐀𝐉𝐀ది𝐑𝐀𝐉𝐀)తో మీ ముందుకు వస్తాం. ఇవాళ మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన అతిథులు అందరికీ థ్యాంక్స్. మీడియా నుంచి కూడా సపోర్ట్ కోరుకుంటున్నా. అన్నారు. హీరోయిన్ విశాఖ దిమాన్ మాట్లాడుతూ - హీరోయిన్ కావాలనే నా కల ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఉందని, ఇందుకు మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాన‌న్నారు. ఈ రాజా ది రాజా (𝐑𝐀𝐉𝐀ది𝐑𝐀𝐉𝐀) సినిమాలో నా రోల్ బాగుంటుందని, నా క్యారెక్టర్‌ను ప్రేక్ష‌కులు ల‌వ్ చేస్తార‌ని, సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 10:34 AM