Mehreen: ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకున్నా.. ఇది చాలా అవసరం!

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:19 PM

ఇటీవల ఓ వేదికపై అండాల శీతలీకరణ (ఎగ్‌ ఫ్రీజింగ్‌) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు 'సీతారామం' ఫేం మృణాల్‌ ఠాకూర్‌. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్‌ ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా చేరారు.

Mehreen:  ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకున్నా.. ఇది చాలా అవసరం!

ఇటీవల ఓ వేదికపై అండాల శీతలీకరణ (ఎగ్‌ ఫ్రీజింగ్‌) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు 'సీతారామం' ఫేం మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ఆ దిశగా అడుగులు వేయాలనే తన ఆలోచనను బయటపెట్టారు. భవిష్యత్తు దీనిపై ఆలోచిస్తానని ఆమె అన్నారు. ప్రస్తుతం కాలంలో కెరీర్‌, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వారికి ‘ఎగ్‌ ఫ్రీజింగ్‌’ (egg Freezing) ఓ వరంగా మారిందనొచ్చు. వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన అండాల్ని భద్రపరచుకొని.. కావాల్సినప్పుడు పిల్లలను కనే వెసులుబాటు కల్పిస్తోన్న ఈ సంతాన పద్థతిని చాలా మంది పాటిస్తున్నారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు చాలామంది ఈ పద్దతిలోనే పిల్లల్ని కన్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్‌ ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకోగా.. తాజాగా ఆ లిస్టులో మెహ్రీన్ పిర్జాదా చేరారు. తాను ఎగ్‌ ఫ్రీజింగ్‌ చేయించుకున్నట్లు స్వయంగా వెల్లడించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేస్తూ.. ‘నా ఎగ్‌ ఫ్రీజింగ్‌ జర్నీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఈ ప్రక్రియకు వెళ్లడానికి నా మనసును సిద్ధం చేసుకోవడానికి 2 సంవత్సరాలు ప్రయత్నించా. చివరకు ఎగ్‌ ఫ్రీజింగ్‌ పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెహ్రీన్‌ పేరొన్నారు. ఎగ్‌ ఫ్రీజింగ్‌ కోసం ప్రొసెస్‌ను ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


‘ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అందరితో పంచుకోవాలా? వద్దా? అని ఆలోచించా. కానీ నాలాంటి చాలా మంది మహిళలు ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో లేదా బిడ్డను ఎప్పుడు కనాలో అని ఇంకా వారు నిర్ణయించుకోలేదు. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యం అని నేను భావించా. ఇది నిషిద్థ అంశంగా పరిగణించబడుతున్నందున దీని గురించి ఎక్కువగా మాట్లాడలేము. సాంకేతికత సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలగుతున్నాం. తల్లి కావాలనేది నా కల?. అయితే కొన్ని సంవత్సరాలు ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ ఎగ్‌ ఫ్రీజింగ్‌.  ఆసుపత్రులు, సూదులు, రక్తం అంటే ఫోబియా ఉన్న నాలాంటి వారికి ఇది సవాలుగా ఉంటుంది. హార్మోన్ల ఇంజెక్షన్ల కారణంగా నేను ఆసుపత్రికి వెళ్లిన ప్రతిసారీ కళ్లు తిరిగి పడిపోయా. ఈపద్దతి కరెక్టేనా అని నన్ను అడిగితే కచ్చితంగా అవును అనే చెబుతా. మీరు ఏ పనిని ఎంచుకున్నా.. మీ కోసం చేయండి. ఎప్పుడూ నా పక్కనే ఉన్న నా గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రిమ్మీ, మా అమ్మకు ధన్యవాదాలు’’ అని మెహ్రీన్‌ పిర్జాదా రాసుకొచ్చారు. mehreen.jpg

Updated Date - Apr 30 , 2024 | 12:43 PM