మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మెగాస్టార్‌తో రష్యా ప్రతినిధుల సమావేశం..  మ్యాటర్‌ ఏంటంటే..!

ABN, Publish Date - Apr 19 , 2024 | 01:14 PM

మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో (Moscow Team) నుంచి వచ్చిన  రష్యా బృందం నేరుగా హైదరాబాద్‌లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు.

మెగాస్టార్‌ చిరంజీవి (chiranjeevi) రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మాస్కో (Moscow Team) నుంచి వచ్చిన  రష్యా బృందం నేరుగా హైదరాబాద్‌లోని చిరంజీవికి ఇంటికి వెళ్లి కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సహకారంపై వారితో చర్చించారు. రష్యాలో తెలుగు చిత్రాల షూటింగ్‌తో సహా తదితర అంశాలపై వారితో మాట్లాడారు. రష్యాలో (Russian celebs meeting) తెలుగు సినిమాల షూటింగ్‌ను ప్రమోట్‌ చేయడానికి వారు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ్ఘభారతీయ, తెలుగు చలనచిత్ర పరిశ్రమ, రష్యా మధ్య సృజనాత్మక సహకారాలపై ప్రతినిధి బృందం చిరంజీవితో మాట్లాడారు. దీనికి సంబధించిన ఫొటోలు, వీడియోలో నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.ఇండస్ట్రీస్  డెవలప్‌మెంట్‌ సెంటర్‌ హెడ్‌ ఎకటెరినా చెర్కెజ్‌ జాడే, ఫెడరల్‌ ఏజెన్సీ ఫర్‌ స్ర్టాటజిక్‌ ఇనిషియేటివ్స్‌ మాస్కో, యూనివర్సల్‌ యూనివర్శిటీ డైరెక్టర్‌ మరియా సిట్‌కోవ్‌స్కాయా ఉన్నారు.



కాగా.. భోళాశంకర్‌ తర్వాత మెగాస్టార్‌ నటిస్తోన్న సోషియో-ఫాంటసీ చిత్రం విశంభర.  వశిష్ట మల్లిడి  దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న విడుదల కానుంది.

Updated Date - Apr 19 , 2024 | 01:18 PM