Chiranjeevi: కనిపించే దేవత.. కని పెంచిన అమ్మకి శుభాకాంక్షలు! 

ABN , Publish Date - Jan 29 , 2024 | 05:51 PM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో షేర్‌ చేసి "కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు

Chiranjeevi: కనిపించే దేవత.. కని పెంచిన అమ్మకి శుభాకాంక్షలు! 

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మాతృమూర్తి అంజనా దేవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో షేర్‌ చేసి "కనిపించే దేవత, కని పెంచిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ ఫొటోలు చూసి  చిరు అభిమానులు 'మాకు ఇంత గొప్ప హీరోని, అనుక్షణం అభిమానుల గురించి తపించే అన్నయ్యను ఇచ్చినందుకు నీకు రుణపడి ఉంటాం అంజనమ్మా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. (Hbd Anjanadevi)

చిరంజీవి చేసిన సోషల్‌ సర్వీస్‌ను గుర్తించిన భారత ప్రభుత్వం రిపబ్లిక్‌ డే సందర్భంగా చిరుకి దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్‌ను ప్రకటించింది. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర చిత్రం చేస్తున్నారు. వశిష్ట మల్లిడి దర్శకుడు. ఫాంటసీ కథతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో చిరు సరసన త్రిష కథానాయికగా నటించబోతోందని వార్తలు వస్తున్నాయి. 


Updated Date - Jan 29 , 2024 | 05:52 PM