మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ప‌వ‌న్‌ అభిమానుల‌కు అదిరిపోయే అప్డేట్.. హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడ‌తాడు

ABN, Publish Date - Feb 12 , 2024 | 06:54 PM

ప‌వ‌న్‌క‌ల్యాణ్ అభిమానుల‌కు ఇది నిజంగా ఇది అదిరిపోయే వార్తే. చాలాకాలంగా ప‌డుతూ లేస్తూ వ‌స్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం గురించి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు.

hari hara veeramallu

ప‌వ‌న్‌క‌ల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల‌కు ఇది నిజంగా ఇది అదిరిపోయే వార్తే. చాలాకాలంగా ప‌డుతూ లేస్తూ వ‌స్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం గురించి మేక‌ర్స్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో స‌రికొత్త ఉత్సాహం వ‌చ్చింది. నిమిషాల్లోనే వేల ట్వీట్లు, రీ ట్వీట్ల‌తో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. హ‌రి హ‌రి వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu ), ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) హ్యాష్ ట్యాగ్‌ల‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చారు.

ఇటీవ‌ల క్రిష్ ఈ సినిమా నుంచి వైదొలిగాడ‌ని, అనుష్క‌తో ఓ కొత్త చిత్రం చేస్తున్న‌ట్లు రూమ‌ర్స్ రావ‌డంతో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు (Hari Hara Veera Mallu ) చిత్రం ఇక‌ మూల‌కు ప‌డిన‌ట్లేన‌ని అనుకున్నారు. ఈక్ర‌మంలో ఇప్పుడు నిర్మాత‌లు సాలిడ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ నెత్తిన‌ పాలు పోశారు.


ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ‘ప్రియ‌మైన ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల‌కు,సినీ ప్రేక్ష‌కుల‌కు ఇంకా చాలామంది చాలాకాలంగా ఎంతో అతృత‌తో ఎదురు చూస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం ఆప్డేట్ మీ కోసం.. సినిమా ఆగిపోలేద‌ని ప్రస్తుతం ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల‌లో చోట్ల హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా హై ఎండ్ వీఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది, మీ ఊహ‌ల‌కు అంద‌నంత స్థాయిలో ఈ చిత్రం రూపు దిద్దుకుంటోంద‌ని, త్వ‌ర‌లో మిమ్మ‌ల్ని థ్రిల్ చేస్తూ, సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ప్రోమోతో మీముందుకు వ‌స్తామ‌ని అప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రంపై వ‌చ్చే రూమ‌ర్స్‌ను న‌మ్మొద్ద‌ని’ కోరుతూ నిర్మాణ సంస్థ మెగా సూర్యా ప్రోడ‌క్ష‌న్స్ (Mega Surya Production) సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్టు పెట్టింది..

Updated Date - Feb 12 , 2024 | 07:21 PM