ఎట్టకేలకు 'గుంటూరు కారం' నుండి మీనాక్షి చౌదరి లుక్ వచ్చింది

ABN , Publish Date - Jan 04 , 2024 | 12:18 PM

మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా 'గుంటూరు కారం' నుండి ఎట్టకేలకు మీనాక్షి చౌదరి లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఆమె పాత్ర పేరు రాజి అని ఆమె మహేష్ బాబు మరదలుగా ఇందులో నటిస్తోందని తెలుస్తోంది.

ఎట్టకేలకు 'గుంటూరు కారం' నుండి మీనాక్షి చౌదరి లుక్ వచ్చింది
Meenakshi Chaudhary

మహేష్ బాబు, (Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం' #GunturKaaram. జనవరి 12న విడుదలకి సర్వం సిద్ధం అయింది. శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) లు కథానాయికలు, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మాత. ఈ సినిమా నుండి మహేష్ బాబు లుక్, శ్రీలీల లుక్ చాలానే వచ్చాయి, కానీ ఇంకో కథానాయిక అయిన మీనాక్షి చౌదరి లుక్ ఇంతవరకు రాలేదు. అసలు ఆమె పాత్ర ఎలా వుండబోతోంది అని కూడా ప్రేక్షకులకు తెలియలేదు.

అయితే ఈరోజు చిత్ర నిర్వాహకులు ఆమె సినిమాలో ఎలా ఉండబోతోందో కూడా ఈరోజు విడుదల చేశారు. ఆమె పాత్ర పేరు రాజి అని చెప్పారు. ఆమె మహేష్ బాబు భుజాలను పట్టుకొని వెనకాల నిలుచొని వున్న ఒక ఫోటోని ఈరోజు విడుదల చేశారు. అంటే ఆమె మహేష్ బాబు కి మరదలి పాత్రలో కనపడబోతోంది అని అర్థం అవుతోంది ఈ స్టిల్ చూస్తుంటే.

meenakshichaudharygunturkaa.jpg

ఈ సినిమా నుండి ఇప్పటి వరకు మూడు పాటలు విడుదల చేశారు, అవన్నీ మహేష్ బాబు, శ్రీలీలపై చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. మరి మీనాక్షి చౌదరికి, మహేష్ బాబుపై ఎటువంటి పాట చిత్రీకరణ జరగలేదని తెలుస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా వుండబోతోంది, కేవలం మహేష్ బాబు మరదలుగా చిన్న పాత్రలో కనిపిస్తుందా, ఎటువంటి పాత్ర అనేది సినిమా చూస్తే కానీ ప్రేక్షకులకి అర్థం కాదు అని తెలుస్తోంది.

ఇందులో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు తాత గా కనిపిస్తారని, ఇంకా రమ్యకృష్ణ, జయరాం, రావు రమేష్, మురళి శర్మ, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ లాంటి నటీనటులు వున్నారని తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్, మహేష్ బాబు ఈ సినిమాతో రావటంతో మహేష్ బాబు అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొని వుంది.

Updated Date - Jan 04 , 2024 | 12:36 PM