Meenaakshi Chaudhary: చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా చిత్రాలే

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:04 PM

చిన్న చిత్రాలతో కథానాయకిగా కెరీర్‌ ప్రారంభించి అగ్ర హీరోల సరసన అవకాశం అందుకొంది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) . 'గుంటూరు కారం’ చిత్రంలో మహేష్ కు  మరదలిగా నటించి మెప్పించింది.

Meenaakshi Chaudhary:  చేతిలో ఉన్నవన్నీ పాన్ ఇండియా చిత్రాలే

చిన్న చిత్రాలతో కథానాయకిగా కెరీర్‌ ప్రారంభించి అగ్ర హీరోల సరసన అవకాశం అందుకొంది మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) . 'గుంటూరు కారం’ చిత్రంలో మహేష్ కు  మరదలిగా నటించి మెప్పించింది. టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ చక్కని అవకాశాలు అందుకుంటోంది. విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన 'కొలె’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు విజయ్‌ సరసన 'గోట్‌' (Goat)చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం అంచనాల మధ్య సెప్టెంబర్‌ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Meenakshi.jpg

ఈ సందర్భంగా ఇటీవల మీనాక్షి ఓ ఇంగ్లిష్‌ మీడియాతో మాట్లాడుతూ ''నటిగా చక్కని అవకాశాలు రావడం అన్నది దేవుడి వరంగా భావిస్తున్నాను. వరుసగా చాలా అవకాశాలు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. విజయ్‌కు జంటగా నటించిన గోట్‌ చిత్రం పాన్  ఇండియా స్థాయిలో సెప్టెంబర్‌లో విడుదలకు సిద్థం అవుతుంది. అలాగే దుల్కర్‌సల్మాన్‌ సరసన నటించిన లక్కీ భాస్కర్‌ కూడా పాన్  ఇండియా చిత్రమే. ఈ సినిమా కూడా సెప్టెంబర్‌లోనే విడుదల కానుంది.
అలాగే తెలుగులో వెంకటేశ్‌కు జంటగా ఓ కొత్త చిత్రంలోనూ, వరుణ్‌ తేజ్‌ సరసన మట్కా చిత్రంలో నటిస్తున్నాను. ప్రస్తుతం చేతిలో ఉన్నవన్నీ పాన్  ఇండియా చిత్రాలే.  ఇవన్నీ చూస్తుంటే ఓ పక్క సంతోషంగా ఉన్నా, మరో పక్క భయంగానూ. ఒత్తిగానూ ఉంది. యువ హీరో లతోపాటు అగ్రహీరోలతో కూడా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.  

Updated Date - Jul 26 , 2024 | 05:04 PM