scorecardresearch

Meenakshi Chaudhary: నాకు ఆ ఆలోచనే లేదు.. మీనాక్షి

ABN , Publish Date - Nov 20 , 2024 | 08:14 PM

మెకానిక్ రాకీ ప్రమోషన్స్‌లో నటి మీనాక్షి చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..

Meenakshi Chaudhary: నాకు ఆ ఆలోచనే లేదు.. మీనాక్షి

అసలే ఇప్పుడిప్పుడే కెరీర్ చక్కదిద్దుకుంటోంది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆర్మీ ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ చిన్నది, కెరీర్ స్టార్టింగ్లో కొంచం ఇబ్బందిపడిన ఆమె ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. మొన్నే “లక్కీ భాస్కర్”తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అమ్మడికి వెంటనే “మట్కా” డిజాస్టర్‌తో బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ భామ మళ్లీ వరుస సినిమాతో సిద్ధమవుతోంది. ఈ శుక్రవారం “మెకానిక్ రాకీ”తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మీనాక్షి, సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం”తో బరిలోకి దిగింది.


అయితే.. ఈమధ్యలో ఆమె పెళ్లి చేసుకోనుంది అనే వార్త హల్ చల్ చేసింది. తన మొదటి తెలుగు సినిమా “ఇచట వాహనములు నిలుపరాదు” హీరో అయిన సుశాంత్ ను ఆమె పెళ్లి చేసుకోనుందనే వార్త బాగా వైరల్ అయ్యింది. అయితే.. మెకానిక్ రాకీ ప్రమోషన్స్‌లో భాగంగా మీమర్స్‌తో ఇంటరాక్ట్ అయిన ఆమె ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. అసలు ఈ వార్త ఎందుకొచ్చిందో కూడా తెలియదు, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదు అని క్లారిటీ ఇచ్చేసింది.

Meenakshi-Chaudhary-Sushant.jpg

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 20 , 2024 | 08:15 PM