scorecardresearch

Vishwak sen: ఏ తప్పూ చేయట్లేదు.. చోరీలు చేయట్లేదు  

ABN , Publish Date - Nov 17 , 2024 | 10:47 PM

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. మీనాక్షీ చౌదరి, శ్రద్థా శ్రీనాథ్‌ కథానాయికలు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది.

Vishwak sen: ఏ తప్పూ చేయట్లేదు.. చోరీలు చేయట్లేదు  

 

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ (Vishwak sen) హీరోగా నటించిన తాజా చిత్రం ‘మెకానిక్‌ రాకీ' Mechanic Rocky) . మీనాక్షీ చౌదరి, శ్రద్థా శ్రీనాథ్‌ కథానాయికలు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. విశ్వక్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా నేను మా టీమ్‌ కష్టం గురించి చెప్పా. దాన్ని కొందరు ట్రోల్‌ చేశారు. మేం ఇలానే మా సినిమాలను ప్రమోట్‌ చేసుకుంటాం. మేం ఏ తప్పూ చేయట్లేదు. చోరీలు చేయట్లేదు.. గర్వంగా సినిమాలు చేస్తున్నాం. ఇటీవల ‘మెకానిక్‌ రాకీ’ సినిమా ఫైనల్‌ కాపీ చూశా. ఈ సినిమా ఆడకపోతే షర్ట్‌ లేకుండా చెక్‌పోస్ట్‌ వద్ద తిరుగుతా, ఫిల్మ్‌నగర్‌లో ఉన్న ఇల్లు ఖాళీ చేస్తానని ఛాలెంజ్‌ చేయాలనుకోవట్లేదు. ఇది హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా ఇక్కడే ఉంటా. ‘నేనింతే’లో రవితేజ చెప్పినట్టు.. నాకు తెలిసిందొక్కటే సినిమా.. సినిమా.. సినిమా’’ అని అన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 10:54 PM