మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ పాట విడుద‌ల‌

ABN , Publish Date - Jan 01 , 2024 | 03:16 PM

నూత‌నంగా రూపుదిద్దుకుంటున్న‌‘రాఘువ రెడ్డి’ చిత్రం నుంచి ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ సాగే పాట‌ను తాజాగా విడుద‌ల చేశారు ఈ పాట‌ను ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించారు.

మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ పాట విడుద‌ల‌
raghava reddy

‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచి పోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని (Siva Katamneni) హీరోగా రాశి( Raasi), నందితా శ్వేత (Nandita Swetha) ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’(Raghava Reddy).

n.jpeg

స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రాఘవరెడ్డి’ మూవీ జనవరి 5న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం ‘రాఘువ రెడ్డి’ నుంచి ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అనే ఐటెమ్ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు సుధాకర్ మారియో సంగీతాన్ని అందించారు. సాగర్ నారాయణ్ సాహిత్యాన్ని అందించారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ పాటను ఆలపించారు.


ఈ సందర్భంగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. శివ కంఠమనేని గారిని కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన ఈ సినిమాను జనవరి 5న రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగ్లీ పాడిన ‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ సాంగ్ విడుదల చేశాం. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని అన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 03:16 PM