Mangalavaaram: బుల్లి తెరపై కూడా సత్తా చాటింది

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:12 PM

పాయల్ రాజ్ పుత్  ముఖ్య పాత్రలో బోల్డ్ కథాంశంతో దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం 'మంగళవారం'. అన్ని వర్గాల ప్రేక్షకులని, విమర్శకులని, తెలుగు పరిశ్రమ దిగ్గజాలని కూడా ఆకట్టుకుని థియేటర్లలో భారీ విజయంతో కంటెంట్ ఉన్న చిత్రాల బలం చూపించింది

Mangalavaaram: బుల్లి తెరపై కూడా సత్తా చాటింది

పాయల్ రాజ్ పుత్ (Payal rajputh) ముఖ్య పాత్రలో బోల్డ్ కథాంశంతో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం 'మంగళవారం'. అన్ని వర్గాల ప్రేక్షకులని, విమర్శకులని, తెలుగు పరిశ్రమ దిగ్గజాలని కూడా ఆకట్టుకుని థియేటర్లలో భారీ విజయంతో కంటెంట్ ఉన్న చిత్రాల బలం చూపించింది ఈ చిత్రం. జాతీయ, అంతర్జాతీయ వీక్షకుల నుండి ఓ వైపు ఓటిటి లో అద్భుతమైన స్పందన లభిస్తుండగా ఇటీవల జరిగిన టి.వి ప్రీమియర్ లో రికార్డ్ టి.ఆర్.పి సాధించింది. ఈ మధ్య భారీ తారాగణం తో వచ్చిన చిత్రాలకి కూడా సాధ్యపడని 8.3 రేటింగ్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది 'మంగళవారం' చిత్రం.  ఉద్వేగంతో కూడిన కథ, మతిపోయే ట్విస్టులు, ఒళ్ళు జలదరించేలా నేపథ్య సంగీతం, విజువల్స్ వల్ల ఈ చిత్రం చూసిన కొన్ని రోజుల తర్వాత కూడా మనసుని వదలదు అని కొందరు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి, నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం తమ సంతోషం వ్యక్తం చేస్తూ ఇలాంటి మరిన్ని చిత్రాలు తీసుకురావడానికి ప్రయత్నిస్తామన్నారు.

Updated Date - Feb 27 , 2024 | 04:12 PM