Manchu Vishnu: నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది

ABN , Publish Date - Jun 07 , 2024 | 06:18 PM

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. భారీ వ్యయం, అత్యాధునిక సాంకేతిక తో రూపొందుతున్న ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.

Manchu Vishnu: నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'కన్నప్ప' చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. భారీ వ్యయం, అత్యాధునిక సాంకేతిక తో రూపొందుతున్న ఫాంటసీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఈ మూవీ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కథానాయకుడు విష్ణు చెప్పారు. ‘కేన్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో థ్రిల్‌గా అనిపిస్తోంది. పురాణగాథ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను జూన్‌ 14న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు.





పాన్ ఇండియా  స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు, విష్ణు నిర్మాతలు. ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ పాల్గొన్నారు. అక్షయ్‌ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 06:46 PM