Manchu Manoj: తిరుమల లడ్డూ  కల్తీ.. మంచు మనోజ్‌ స్పందన

ABN, Publish Date - Sep 22 , 2024 | 04:23 PM

తిరుమల శ్రీనివాసుడి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని వస్తున్న వార్తలు తనని ఎంతో బాధించాయని హీరో మంచు మనోజ్‌ తెలిపారు.

Manchu Manoj:  తిరుమల లడ్డూ  కల్తీ.. మంచు మనోజ్‌ స్పందన


తిరుమల శ్రీనివాసుడి లడ్డూ (Tirumala Laddu) ప్రసాదంలో జంతువుల కొవ్వు (Animal Fat) కలుపుతున్నారని వస్తున్న వార్తలు తనని ఎంతో బాధించాయని హీరో మంచు మనోజ్‌ (Manchu Manoj) తెలిపారు. ఈ విషయంపై రాజకీయ పార్టీలన్నీ ఒకేతాటి పైకి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. బాధ్యతులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘లక్షలాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తూ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వును వాడారని తెలిసి ఎంతో కలత చెందాను. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు. భక్తుల మనోభావాలను అవమానించడం. ఈ తరుణంలో అన్ని  పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి. బాధ్యులను గుర్తించాలి. వారిపై తగిన చర్యలు తీసుకోవాలి. సంస్కృతి, మతపరమైన విలువలను గౌరవించాలి. సంప్రదాయా?ను ఉల్లంఘిేస్త సహించబోమనడానికి ఇదొక ఉదాహరణ కావాలి’’ అని మనోజ్‌ పేర్కొన్నారు.

Updated Date - Sep 22 , 2024 | 04:25 PM