ఆదిపర్వంలో మంచు లక్ష్మి నట విశ్వరూపం

ABN , Publish Date - Feb 03 , 2024 | 01:34 PM

మంచు లక్ష్మి నటిస్తున్న 'ఆదిపర్వం' చిత్రంలో గ్రాఫిక్ పనులు తుది దశకు చేరుకున్నాయని, అవి సినిమాకి హైలైట్స్ అని దర్శకుడు సంజీవ్ మేగోటి చెప్పారు. ఇందులో నాగమ్మగా లక్ష్మి నటిస్తున్నారని, పోరాట సన్నివేశాలు కూడా చేశారని చెప్పారు.

ఆదిపర్వంలో మంచు లక్ష్మి నట విశ్వరూపం
Manchu Lakshmi from Aadiparvam

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఆదిపర్వం', ఇందులో మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఐదు భాషల్లో నిర్మాణం జరుపుకుంటోంది. ఇది ఒక పీరియడ్ డ్రామా, కథా నేపధ్యం 1974 నుంచి 1992 మధ్య జరిగే కథ. ఈ సినిమాకి గ్రాఫిక్స్ వర్క్ చాలా అవసరమని అవి హైలైట్ గా నిలుస్తుందని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు. 'అమ్మోరు', 'అరుంధతి' చిత్రాల మాదిరిగా హై టెన్షన్ యాక్షన్ ఫిలింగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా సిద్ధం అవుతోందని తెలిపారు.

manchulakshmistill.jpg

ఈ సినిమాలో నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నటవిశ్వరూపం చూడవచ్చని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మంచు లక్ష్మి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని అతను చెప్పారు. ఆమెతో పాటు ఆదిత్య ఓం, ఎస్తర్ నొరోన్హా, శ్రీజిత ఘోష్, ఇంకా చాలా మంచి నటీనటులు తమ తమ పాత్రల్లో విజృంభించారని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గ్రాఫిక్స్ వర్క్ చివరిదశకు చేరుకుందని అతను చెప్పారు.

manchulakshminata.jpg

నాగమ్మగా చేస్తున్న మంచులక్ష్మి గారు ఎంతో రిస్క్ చేసి రెండు అద్భుతమైన పోరాట సన్నివేశాలు చేశారని, ఆ రెండు ఫైట్స్ చిత్రానికి హైలెట్ అని, క్షేత్ర పాలకుడిగా ప్రత్యేక పాత్ర చేస్తున్న శివకంఠంనేని కూడా అద్భుతంగా చేశారు అని శ్రీనివాస రావు తెలిపారు.

Updated Date - Feb 03 , 2024 | 01:35 PM