scorecardresearch

Manchu Lakshmi: అలాంటి వారిని నడిరోడ్డుపై నరకాలి!

ABN , Publish Date - Jul 09 , 2024 | 08:11 PM

'చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా వ్యవహరించే వాళ్లని రోడ్డు మీద అడ్డంగా నరకాలి' అన్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె ప్రదాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’.

Manchu Lakshmi: అలాంటి వారిని నడిరోడ్డుపై నరకాలి!

'చిన్న పిల్లల విషయంలో అసభ్యంగా వ్యవహరించే వాళ్లని రోడ్డు మీద అడ్డంగా నరకాలి' అన్నారు మంచు లక్ష్మీ ప్రసన్న. ఆమె ప్రదాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. ఈ చిత్రానికి సంబంధించిన మీడియా సమావేశంలో ఆమె ఈ మేరకు కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ప్రణీత్‌ హనుమంతు అంశం మీద ఆమెను ప్రశ్నించగా చైల్డ్‌ అబ్యూజ్‌ ఎవరు చేసినా వాళ్ళని రోడ్డు మీద అడ్డంగా నరకాలి అన్నారు. శివ కంఠంనేని, ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరోనా, శ్రీజిత ఘోష్‌, వెంకట్‌ కిరణ్‌, సత్యప్రకాష్‌, సుహాసిని ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రాన్ని రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్‌, ఏఐ ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళంలో రూపొందిస్తున్నారు. సంజీవ్‌ మేగోటి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఆదిపర్వం’ సినిమా త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Manchu.jpg

మంచు లక్ష్మి మాట్లాడుతూ '‘ఆదిపర్వం’ లాంటి భారీ చిత్రాన్ని ఇంత త్వరగా సీజీ వర్క్‌తో సహా కంప్లీట్‌ చేస్తారని  అనుకోలేదు. ఈ సినిమాకు ఒక భగీరథ ప్రయత్నం చేశారు మా దర్శకుడు సంజీవ్‌. ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్ని ప్రేక్షకులకు చూపిస్తున్నాం అంటే అది మన నేల గొప్పదనం. ఈ శక్తవంతమైన గడ్డ మీద ఉన్నాం కాబట్టే ఇలాంటి నేపథ్యాలతో సినిమాలు చేయగలుగుతున్నాం. దేవత అయినా దెయ్యం అయినా నన్నే అప్రోచ్‌ అవుతున్నారు. ‘‘ఆదిపర్వం’’ మీ అందరికీ నచ్చేలా ఉంటుందని చెప్పగలను అన్నారు. 

Updated Date - Jul 09 , 2024 | 08:11 PM