DhoomDham : మంగ్లీ ఆటా పాట‌.. ధూం ధాం మూవీ నుంచి 'మల్లెపూల టాక్సీ..' ప్రోమో రిలీజ్

ABN , Publish Date - Jun 05 , 2024 | 09:59 AM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ధూం ధాం తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ మల్లెపూల టాక్సీ ప్రోమో రిలీజ్ చేశారు.

DhoomDham : మంగ్లీ ఆటా పాట‌.. ధూం ధాం మూవీ నుంచి 'మల్లెపూల టాక్సీ..' ప్రోమో రిలీజ్
dhoom dham

చేతన్ కృష్ణ (ChetanKrishna), హెబ్బా పటేల్ (Hebah Patel) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా ధూం ధాం (DhoomDham). సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మిస్తుండ‌గా సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వ‌హిస్తున్నారు. గోపీ మోహన్ స్టోరీ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

WhatsApp Image 2024-06-05 at 8.22.05 AM.jpeg


తాజాగా ఈ ధూం ధాం చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ మల్లెపూల టాక్సీ (Malle Poola Taxi) ప్రోమో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియోను ఈ నెల 5వ తేదీన ఉదయం 9.18 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. మల్లెపూల టాక్సీ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా..గోపీ సుందర్ (Gopi Sundar ) క్యాచీ బీట్ తో కంపోజ్ చేశారు. గాయని మంగ్లీ (Mangli) ఈ పాటను ఎనర్జిటిక్ గా పాడటమే కాదు లిరికల్ వీడియోలో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది.

Updated Date - Jun 05 , 2024 | 09:59 AM