SSMB29: రాజమౌళి సినిమా.. మహేష్‌ అప్‌డేట్‌

ABN , Publish Date - Mar 05 , 2024 | 01:37 PM

మహేశ్‌బాబు (Maheshbabu) కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిర్మాణ సంస్థ నుంచి గానీ, దర్శకుడి నుంచి గానీ ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు.

SSMB29: రాజమౌళి సినిమా.. మహేష్‌ అప్‌డేట్‌

మహేశ్‌బాబు (Maheshbabu) కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించి రోజుకో ఆసక్తికర విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. నిర్మాణ సంస్థ నుంచి గానీ, దర్శకుడి నుంచి గానీ ఇప్పటిదాకా అధికారికంగా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. కానీ రోజుకో కొత్త విషయం వైరల్‌ అవుతూనే ఉంది. దీనిపై సినిమా టీమ్‌ ఎక్కడా స్పందించలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి స్పందిస్తూ, ‘మహేశ్‌తో సినిమా తీస్తున్నా. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్ట్‌ టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు’ అని అన్నారు. ఇప్పుడు మహేశ్‌బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరొక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘రాజమౌళి సర్‌తో చేసే సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్‌ పనులు చాలా బాగా జరుగుతున్నాయి. త్వరలోనే ఆయనతో ప్రయాణం మొదలుపెట్టడానికి చాలా ఆసక్తిగా ఉన్నా’ అని అన్నారు. ఈ అప్‌డేట్‌తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇంకా తన కెరీర్‌ను మలుపు తిప్పిన మూడు చిత్రాలు గురించి చెప్పుకొచ్చారు. (SSMB29)‘‘మురారి’, ‘పోకిరి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు నన్ను బాగా ప్రభావితం చేసి, నా  కెరీర్‌ను మలుపు తిప్పాయి. డిఫరెంట్‌ స్టోరీ లైన్లతో  తెరకెక్కించిన ఈ చిత్రాలు ఆడియన్స్ కు  నన్ను మరింత దగ్గర చేశాయి. ప్రేక్షకులకు నచ్చేలా సినిమాలు చేయాలని నైతిక అంశాల ఆధారంగా కథను ఎంపిక చేసుకుంటాను. ఒకే రకమైన పాత్రల్లో నటించడం నాకు నచ్చదు. వ్యక్తిగత విలువలకు దగ్గరగా ఉంటూ, నా స్వభావాన్ని అభిమానులకు తెలియజేసేలా ఉన్న పాత్రలు పోషిస్తా. సినీ ఇండస్ట్రీలో విజయంపై నా ఆలోచనా విధానం మారింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు ముఖ్యమైనప్పటికీ సినిమా ప్రేక్షకులపై చూపే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నా. అందులో భాగంగానే ‘గుంటూరు కారం’లో నటించాను. ఈ చిత్రానికి సవాళ్లు ఎదురైనా ప్రేక్షకుల ఆదరణ పొందింది. నా అభిమానులే ఇందుకు అభిమానులు. ఒక సినిమాకు సైన్ చేశానంటే అది పూర్తయ్యేదాకా దర్శకుడి విజన ప్రకారమే నడుచుకుంటా’’ అని మహేశ్‌ బాబు అన్నారు.

Mahesh.jpg

ఎస్‌ఎస్‌ఎంబీ 29 గురించి ఆసక్తికర విషయాలు
ఈ చిత్రంతో భారతీయ సినిమా చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని ఇటీవల రచయిత విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ అనువదించనున్నారు. ఇప్పటివరకూ వెండితెరపై కనిపించని సరికొత్త లుక్‌లో మహేశ్‌ కనిపిస్టారని, ఆ దిశగా జక్కన్న పాత్రను తీర్చిదిద్దనున్నారని మొదటి నుంచి టాక్‌ వినిపిస్తోంది. గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో ఇందులో కనిపించనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో దృడంగా కనిపించేందుకు అవసరమైన కసరత్తులు మహేశ్‌ చేస్తున్నారు. ఇటీవల మహేష్‌ లుక్‌కి సంబంధించిన స్కెచ్లు  పూర్తయ్యాయని తెలిసింది. మొత్తం ఎనిమిది డిఫరెంట్‌ లుక్స్‌ జక్కన్న టీమ్‌ రెడీ చేసిందట. కథకు, మహేశ్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఆ లుక్స్‌ మహేశ్‌ను టెస్ట్‌ ఫొటో షూట్‌ చేసి, ఫైనల్‌ లుక్‌ ఖరారు చేయనున్నారని సమాచారం!

Updated Date - Mar 05 , 2024 | 01:41 PM