Guntur Kaaram: విడుద‌ల‌కు ముందే.. గుంటూరు కారం రికార్డుల ఊచ‌కోత‌! 24 గంట‌ల్లో ఏకంగా ఇన్ని వ్యూసా

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:29 PM

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు, తివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అత‌డు, ఖ‌లేజా చిత్రాల అనంత‌రం ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి చేస్తున్న గుంటూరు కారం సినిమా విడుద‌ల‌కు ముందే స‌రికొత్త రికార్డుల ఊచ‌కోత‌ సృష్టిస్తోంది.

Guntur Kaaram: విడుద‌ల‌కు ముందే..  గుంటూరు కారం రికార్డుల ఊచ‌కోత‌! 24 గంట‌ల్లో ఏకంగా ఇన్ని వ్యూసా
mahesh babu

సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు (Mahesh Babu), తివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అత‌డు, ఖ‌లేజా చిత్రాల అనంత‌రం ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి చేస్తున్న గుంటూరు కారం సినిమా విడుద‌ల‌కు ముందే స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తోంది. ట్రైల‌ర్ (Guntur Kaaram Trailer) విడుద‌లైన 24 గంట‌ల్లో 39 మిలియ‌న్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే ఈ ఘ‌న‌త సాధించిన‌ తొలి చిత్రంగా రికార్డుల‌కెక్కింది.

నిన్న (07.01.2024) ఆదివారంరాత్రి 9.09 నిమిషాల‌కు ఈ చిత్ర టైల‌ర్ (Guntur Kaaram Trailer) ను విడుద‌ల చేయ‌గా ఈ రోజు రాత్రి 9.09 నిమిషాల వ‌ర‌కు దాదాపు 40 మిలియ‌న్ల మంది వీక్షించిన‌ట్లు చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టిస్తూ సోష‌ల్‌మీడియా వేదిక‌గా పంచుకున్న‌ది. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట తెగ వైర‌ల్ అవ‌డ‌మే కాక అల్‌టైమ్ రికార్డ్ పేరిట సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది.


గుంటూరు కారం త‌ర్వాత స‌లార్ 24 గంట‌ల్లో 32.58 M , స‌ర్కారు వారి పాట 26.77 M, రాధేశ్యాం 23.3 M, ఆచార్య 21.86M, బాహుబ‌లి 2 21.81M, RRR 20.45 M, KGF2 19.38 M, బ్రో ది అవ‌తార్ 19.25 M వ్యూస్ సాధించిన జాబితాలో ఉన్నాయి. అయితే గుంటూరుకారం 40 మిలియ‌న్ వ్యూస్ అంటే 4 కోట్ల వ్యూస్‌తో పాటు 7 ల‌క్ష‌ల లైకులు,30.కే కామెంట్లు సాధించడం కూడా ఓ రికార్డు అంటూ మ‌హేశ్‌బాబు ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:29 PM