సెప్టెంబర్‌లో లక్కీ భాస్కర్‌

ABN , Publish Date - May 30 , 2024 | 12:10 AM

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడంలో ముందుండే కొద్దిమంది కథానాయకుల్లో దుల్కర్‌ సల్మాన్‌ ఒకరు. ఆయన నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. 80వ దశకంలో సాగే కథతో...

సెప్టెంబర్‌లో లక్కీ భాస్కర్‌

విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించడంలో ముందుండే కొద్దిమంది కథానాయకుల్లో దుల్కర్‌ సల్మాన్‌ ఒకరు. ఆయన నటిస్తున్న చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. 80వ దశకంలో సాగే కథతో తెరకెక్కుతోంది. బ్యాంక్‌ క్యాషియర్‌ లక్కీ భాస్కర్‌ అనే పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. బుధవారం చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. సెప్టెంబర్‌ 27న ‘లక్కీ భాస్కర్‌’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: నిమిష్‌ రవి. ఎడిటర్‌: నవీన్‌ నూలి.

Updated Date - May 30 , 2024 | 08:00 AM